భాషను మెరుగుపర్చుకోవచ్చు
‘సాక్షి’స్పెల్ బీ పోటీలో పాల్గొన్నాను. ఇది వరకు రెండు సార్లు స్పెల్ బీ పోటీలకు హాజరయ్యాను. జిల్లా స్థాయిలో కూడా రెండు సార్లు పాల్గొన్నాను. స్పెల్ బీ వల్ల ప్రొనౌన్‌షేషన్, ఇంగ్లిష్ భాషపై జ్ఞానం, కొత్త పదాలు తెలుస్తాయి. ప్రతి విద్యార్థి స్పెల్ బీ పోటీలో పాల్గొనడం వల్ల వారి భాషను మెరుగుపర్చుకోవచ్చు. –టి.మేధస్వి, 8వ తరగతి
‘సాక్షి’కి ధన్యవాదాలు
‘సాక్షి’మీడియా ఆధ్వర్యంలో గత రెండేళ్లుగా మా పాఠశాలలో స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీలు నిర్వహిస్తున్నారు. నగరంలోని వివిధ పాఠశాలల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. ఇటువంటి పోటీల వల్ల ఇంగ్లిష్, మ్యాథ్స్‌లో మరింత పట్టు సాధించగలరు. ‘సాక్షి’ఆధ్వర్యంలో ఏటా క్రమం తప్పకుండా పోటీలు నిర్వహించడం అభినందనీయం. ‘సాక్షి’మీడియాకు ధన్యవాదాలు. ఇటువంటి పోటీల్లో పాల్గొనేలా తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రోత్సహించాలి.
– ఐ.భాస్కరరావు, ప్రిన్సిపాల్, విశ్వతేజ స్కూల్
భాషను మెరుగుపర్చుకోవచ్చు


