సాగరతీరం ఎస్‌బీఐ గ్రీన్ మారథాన్
ఏయూఏక్యాంపస్: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో బీచ్ రోడ్డు వేదికగా ఆదివారం ‘గ్రీన్ మారథాన్’ ఉత్సాహంగా జరిగింది. ప్రజల్లో ఆరోగ్యం, పర్యావరణ ప్రాధాన్యతలను తెలియజేయడం లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. పార్క్ హోటల్ నుంచి 5, 10, 21 కిలోమీటర్ల దూరాలకు మారథాన్ జరిగింది. ఎస్‌బీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాహుల్ సాంకృత్య ఈ మారథాన్‌ను ప్రారంభించారు. ‘రన్ ఫర్ గ్రీన్ ఇండియా’ అనే నినాదంతో తీరం మార్మోగింది. నగర పౌరులు, ఎస్‌బీఐ సిబ్బంది వారి కుటుంబ సభ్యులు, రక్షణ బలగాల సిబ్బంది పెద్ద సంఖ్యలో ఇందులో పాల్గొన్నారు. పాల్గొన్న వారికి ఆర్గానిక్ టీ షర్టులు అందించారు. అనంతరం పోటీల్లో విజేతలకు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో రీజినల్ మేనేజర్ సంజీత్ కుమార్ దేబ్‌నాథ్, పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్ కె. ఉమా మహేశ్వర రావు తదితరులు పాల్గొన్నారు.


