సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీలకు విశేష స్పందన
సీతంపేట: ‘సాక్షి’ మీడియా ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన స్పెల్ బీ, మ్యాథ్స్ బీ 2025–26 పోటీలకు విశేష స్పందన లభించింది. రైల్వే న్యూకాలనీలోని విశ్వతేజ స్కూల్‌లో ఆదివారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు స్పెల్ బీ క్వార్టర్ ఫైనల్ రౌండ్, మ్యాథ్స్ బీ సెమీ ఫైనల్ పోటీలు నాలుగు కేటగిరీల్లో జరిగాయి. పాఠశాల స్థాయిలో జరిగిన ఈ పోటీల్లో నగరంలోని కేకేఆర్ గౌతమ్, వీటీ స్కూల్ తదితర పాఠశాలలకు చెందిన 300 మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని తమ ప్రతిభను వెలికితీశారు. ఒకటో తరగతి నుంచి పదో తరగతి విద్యార్థులకు నాలుగు కేటగిరీల్లో ఈ పోటీలను నిర్వహించారు. 40 మార్కులకు, 40 నిమిషాల వ్యవధితో పోటీ జరిగింది. ఈ పోటీలో గెలుపొందిన విజేతలు జిల్లాస్థాయి పోటీలో పాల్గొంటారు. ఈ పోటీలకు డ్యూక్స్ వాఫీ ప్రధాన స్పాన్సర్‌గా, ట్రిప్స్ ఇంటర్నేషనల్ స్కూల్ (రాజమండ్రి) అసోసియేట్ స్పాన్సర్‌గా వ్యవహరించాయి. తల్లిదండ్రులు, పాఠశాలల ఉపాధ్యాయులు తమ పిల్లలను పరీక్ష కేంద్రాలకు తీసుకురావడంతో విశ్వతేజ స్కూల్ ఆవరణ సందడిగా మారింది. విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసేలా స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీలు నిర్వహిస్తున్న ‘సాక్షి’ యాజమాన్యానికి వారు కృతజ్ఞతలు తెలిపారు. ఈ పోటీలను ‘సాక్షి’ విశాఖపట్నం బ్రాంచి మేనేజర్ వి.వి.ఎస్.చంద్రరావు పర్యవేక్షించారు.
సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీలకు విశేష స్పందన
సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీలకు విశేష స్పందన
సాక్షి స్పెల్ బీ, మ్యాథ్స్ బీ పోటీలకు విశేష స్పందన


