
ప్రభుత్వ ఆదేశాల మేరకు తదుపరి చర్యలు
నూతన బార్ పాలసీకి అనుగుణంగా లాటరీ ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించామని జాయింట్ కలెక్టర్ కె.మయూర్ అశోక్ మీడియాకు చెప్పారు. జీవీఎంసీ పరిధిలో రిజర్వ్‌లో పది, ఓపెన్ కేటగిరీలో 121 కలిపి మొత్తం 131 బార్లు ఉండగా ఆశావహుల నుంచి 263 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. వీటిలో గీత కులాలకు పది, ఓపెన్ కేటగిరీలో 57 కలిసి మొత్తం 67 బార్లకు లాటరీ ప్రక్రియ ముగిసిందన్నారు. సంబంధిత నివేదికలను ప్రభుత్వానికి సమర్పిస్తామని, దరఖాస్తులు రాక మిగిలిపోయిన బార్ల విషయంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ రామచంద్రమూర్తి, సూపరింటెండెంట్ ప్రసాద్, అసిస్టెంట్ సూపరింటెండెంట్ రాజశేఖర్, సీఐలు, ఇతర అధికారులు పాల్గొన్నారు.