
రైల్వే బాల్‌బ్యాడ్మింటన్ విజేత ఐసీఎఫ్
విశాఖ స్పోర్ట్స్ : ఆల్ ఇండియా రైల్వే బాల్‌బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌ను ఐసీఎఫ్ జట్టు గెలుచుకోగా, సదరన్ రైల్వే జట్టు రన్నరప్‌గా నిలిచింది. శుక్రవారంతో రైల్వే స్టేడియంలో ముగిసిన ఈ టోర్నీలో ఏడు రైల్వే జోన్ జట్లు పాల్గొన్నాయి. చివరిరోజు జరిగిన పోటీల్లో ఐసీఎఫ్ రెండు మ్యాచ్‌లలో విజయం సాధించి ఆధిక్యతను ప్రదర్శించింది. ఎస్‌ఆర్, ఎస్‌సీ, ఈకో రైల్వే జట్లు ఒక్కో మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో లీగ్ రౌండ్ రాబిన్ పద్ధతిలో జరిగిన ఈ పోటీల్లో ఐసీఎఫ్ మొదటి స్థానంలో నిలవగా, ఎస్‌ఆర్, డబ్ల్యూఆర్ జట్లు వరుసగా రన్నరప్, సెకండ్ రన్నరప్‌గా నిలిచాయి. ఎస్‌సీ, ఈకో రైల్వే, ఎస్‌డబ్ల్యూ, ఎస్‌ఈ జట్లు ఆ తర్వాత స్థానాలతో టోర్నీని ముగించాయి. పోటీల ముగింపు కార్యక్రమానికి ఈకో రైల్వే అదనపు జీఎం బీఎస్‌కే రాజ్‌కుమార్ హాజరై విజేతలకు ట్రోఫీలను అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌ఎం లలిత్ బోహ్రా, రైల్వే అధికారులు అజయ్ సమాల్, మనోజ్‌కుమార్, శాంతారాం, హరనాథ్, కబీర్ అన్సారీ తదితరులు పాల్గొన్నారు.