
30న జనసేన బహిరంగ సభ
సీతంపేట: కూటమి ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ నెల 30న ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నట్లు రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి, పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ తెలిపారు. మంగళవారం ద్వారకానగర్‌లోని పౌర గ్రంథాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ నుంచి పార్టీ శ్రేణులంతా పాల్గొనేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సభ పర్యవేక్షణకు 1,400 మంది వలంటీర్లను నియమిస్తున్నట్లు ఆయన తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యేలు వంశీకృష్ణ శ్రీనివాస్, పంచకర్ల రమేష్‌బాబు, విజయకుమార్, డిప్యూటీ మేయర్ దల్లి గోవింద్ పాల్గొన్నారు.