
సెల్‌పాయింట్‌లో వివో ‘వీ60’ ఆవిష్కరణ
డాబాగార్డెన్స్: వివో మొబైల్ కంపెనీ సరికొత్త ఫీచర్లతో రూపొందించిన ‘వివో వీ60’ మొబైల్‌ను మేయర్ పీలా శ్రీనివాసరావు మంగళవారం డాబాగార్డెన్స్‌లోని సెల్‌పాయింట్ షోరూంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మొదటి వివో వీ60 ఫోన్‌ను సెల్‌పాయింట్ కస్టమర్‌కు అందజేశారు. అనంతరం మేయర్ మాట్లాడుతూ భారత్‌లోనే రూపొందించిన వివో వీ60 ఫోన్ అధునాతన ఫీచర్లతో అన్ని సెల్‌పాయింట్ షోరూంలలో అందుబాటులో ఉందన్నారు. వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా సెల్‌పాయింట్ యాజమాన్యం తమను తాము ఎప్పటికప్పుడు ఆధునీకరించుకుంటూ.. ఖాతాదారుల నమ్మకాన్ని చూరగొంటోందని కొనియాడారు. వివో కంపెనీ ఏజీఎం ఎస్‌బీబీ సతీష్ మాట్లాడుతూ కొత్త వివో వీ60 ఫోన్ అల్ట్రా సిమ్, క్వార్ట్జ్ కర్వ్‌డ్ డిస్‌ప్లేతో వస్తుందని వివరించారు. సెల్‌పాయింట్ ఎండీ బాలాజీ పాండే, కార్పొరేటర్ శరగడం రాజశేఖర్, మాజీ కార్పొరేటర్ పోతు సత్యనారాయణ, సంస్థ ఏఎస్‌ఎం గోవింద్, షోరూం మేనేజర్ కొండలరావు, కస్టమర్లు పాల్గొన్నారు.