
స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని హరించేలా కూటమి పాలన
వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా
అధ్యక్షుడు కేకే రాజు
పార్టీ కార్యాలయంలో
ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు
సాక్షి, విశాఖపట్నం: ఎంతోమంది మహనీయుల ప్రాణత్యాగాల ఫలితంగా లభించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రాన్ని కూటమి ప్రభుత్వం అపహాస్యం చేస్తోందని వైఎస్సార్ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు అన్నారు. శుక్రవారం మద్దిలపాలెంలోనిపార్టీ కార్యాలయంలో జిల్లా వలంటీర్ విభాగం అధ్యక్షుడు పీలా ప్రేమకిరణ్ ఆధ్వర్యంలో 79వ స్వాతంత్య్ర దిన వేడుకలు నిర్వహించారు. ముందుగా కేకే రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, దేవన్‌రెడ్డితో కలిసి గాంధీ, అంబేడ్కర్, వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కేకే రాజు మీడియాతో మాట్లాడుతూ మహానేత వైఎస్సార్ ఆశయాలకు అనుగుణంగా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్ట్రాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దారన్నారు. అలాంటి ఈ రాష్ట్రంలో ప్రజల స్వేచ్ఛ, స్వాతంత్య్రాలకు భంగం కలిగిస్తూ రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును కూడా కాలరాస్తున్నారని మండిపడ్డారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం దేశం మొత్తం ఉలిక్కిపడే విధంగా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిందని ఆవేదన వ్యక్తం చేశారు. మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్, చింతలపూడి వెంకటరామయ్య, డిప్యూటీ మేయర్ కె.సతీష్, పార్టీ కార్యాలయ ఇన్‌చార్జి రవిరెడ్డి, పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్, కార్పొరేటర్లు కె.అనిల్‌కుమార్ రాజు, చెన్నా జానికిరామ్, బిపిన్ కుమార్ జైన్, శశికళ, వావిలాల ప్రసాద్, ముఖ్యనేతలు రొంగలి జగన్నాథం, నడింపల్లి కృష్ణంరాజు, రవిరాజు, ద్రోణంరాజు శ్రీవాత్సవ్, డాక్టర్ జహీర్ అహ్మద్, అల్లంపల్లి రాజుబాబు, ిపీలా వెంకటలక్ష్మి, రామన్న పాత్రుడు, మువ్వల సురేష్, శ్రీదేవి వర్మ, దేవరకొండ మార్కండేయులు, బి.రాధ, ఈశ్వరి, బి.హరికిరణ్ రెడ్డి, డా. మంచా నాగమల్లేశ్వరి, నూకరాజు, మక్సూద్ అహ్మద్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు తదితరలు పాల్గొన్నారు.
జాతీయ జెండాను ఆవిష్కరిస్తున్న
పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు