
40 నిమిషాల్లో వాక్యూమ్ క్లీనర్ తయారీ
ఆరిలోవ: శ్రీ కృష్ణాపురంలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ గురుకుల పాఠశాల విద్యార్థులు అటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా మంగళవారం జరిగిన ఈ ఆన్‌లైన్ కార్యక్రమంలో 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉన్న 50 మంది విద్యార్థులు పది గ్రూపులుగా విడిపోయారు. కేవలం 40 నిమిషాల వ్యవధిలో వారు వాక్యూమ్ క్లీనర్ తయారీ ప్రాజెక్టును విజయవంతంగా పూర్తి చేశారు. ఈ సందర్భంగా విద్యార్థుల ప్రతిభను గురుకుల ప్రిన్సిపాల్ రత్నవల్లి, జిల్లా సైన్స్ అధికారి రాజారావు పరిశీలించి, అభినందించారు. తక్కువ సమయంలో ఇంతటి క్లిష్టమైన ప్రాజెక్టును పూర్తి చేయడం అద్భుతమని పేర్కొన్నారు. ఇలాంటి ప్రాజెక్టుల్లో పాల్గొనడానికి విద్యార్థులకు మరింత ప్రోత్సాహం అవసరమన్నారు. గురుకుల ఉపాధ్యాయులు పాల్గొన్నారు.