
సైన్స్ ఫెయిర్‌లో చక్కటి ప్రాజెక్టులు ఆవిష్కరించాలి
ఆరిలోవ: జిల్లాల్లో నిర్వహించనున్న సైన్స్ ఫెయిర్ కోసం ఇన్‌స్పైర్ మనక్–2025 పోస్టర్‌ను బుధవారం కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ డీఈవో ఎన్.ప్రేమకుమార్, సర్వశిక్ష అభియాన్ ఏపీసీ జె.చంద్రశేఖర్, జిల్లా సైన్స్ ఆఫీసర్ పి.రాజారావు, రిసోర్స్ పెర్సన్లు చంద్రాజీ, జానకిరాంతో కలసి ఆవిష్కరించారు. ఆరు నుంచి 12వ తర గతి వరకు చదువుతున్న విద్యార్థులు ఇన్‌స్పైర్ మనక్ సైన్స్‌ఫెయిర్‌లో పాల్గొని మంచి ప్రాజెక్టులు తయారు చేసే విధంగా సిద్ధం చేయాలని విద్యా శాఖాధికారులకు ఆయన సూచించారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ రెండు రోజుల పాటు జరగనున్న ఇన్‌స్పెయిర్ మనక్ సైన్స్ ఫెయిర్‌కు జిల్లా నుంచి అత్యధికంగా నామినేషన్లు వచ్చే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఉప విద్యాశాఖాధికారి సోమేశ్వరరావు, సర్వశిక్ష అభియాన్ సిబ్బంది దేముడుబాబు, అప్పలనాయుడు పాల్గొన్నారు.