దళిత మహిళను మోసం చేసిన ఇద్దరికి రిమాండ్
తగరపువలస: భూమి రిజిస్ట్రేషన్ పేరుతో నగరానికి చెందిన దళిత మహిళ కుంచంగి లక్ష్మిని మోసం చేసి రూ.97 లక్షలు కాజేసిన ఆనందపురానికి చెందిన మీసాల అప్పలనాయుడు, శ్రీదేవి దంపతులను పోలీసులు శనివారం రిమాండ్‌కు తరలించారు. భీమిలి 15వ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ వారికి 15 రోజుల పాటు రిమాండ్ విధించారు. బాధితురాలు ఆనందపురం మండలం చందక పంచాయతీలో మధ్యవర్తుల సాయంతో 30 సెంట్ల భూమిని కొనుగోలు చేసింది. అప్పటికే నకిలీ పత్రాలతో నిందితులు ఆ భూమి తమదిగా చూపించి బాధితురాలి నుంచి డబ్బులు కాజేశారు. భూమి రిజిస్ట్రేషన్ చేయకుండా తప్పించుకోవడంతో పాటు బాధితురాలిపై దాడి కూడా చేశారు. దీంతో పోలీసులు వారిపై ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు.
దళిత మహిళను మోసం చేసిన ఇద్దరికి రిమాండ్


