జీవీఎంసీకి 300 వినతులు
డాబాగార్డెన్స్: జీవీఎంసీలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 300 వినతులు అందాయి. అత్యధికంగా జోన్–8 నుంచి 227 వినతులు రావడం గమనార్హం. జోన్–2 నుంచి 17, జోన్–3 నుంచి 20, జోన్–4 నుంచి 15, జోన్–5 నుంచి 6, జోన్–6 నుంచి 9, జీవీఎంసీ ప్రధాన కార్యాలయానికి 6 ఫిర్యాదులు వచ్చాయి. మేయర్ పీలా శ్రీనివాసరావు ప్రజల నుంచి ఫిర్యాదు స్వీకరించారు. అదనపు కమిషనర్ డీవీ రమణమూర్తి, ప్రధాన ఇంజినీర్ పి.శివప్రసాదరాజు, చీఫ్ సిటీ ప్లానర్ ఎ.ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి, డీసీఆర్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.


