కాలువలో పడి వ్యక్తి మృతి
అక్కిరెడ్డిపాలెం: గాజువాక మండలం చినగంట్యాడ గ్రామం అమరావతి పార్కు వద్ద గల కాలువలో ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ పడి శుక్రవారం మృతి చెందాడు. గాజువాక పోలీసులు తెలిపిన వివరాలివి.. గాజువాక మండలం, పాతకర్ణవానిపాలేనికి చెందిన పి.వెంకటరమణమూర్తి (60) ఆఫ్టింగ్ డ్రైవర్‌గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. నాలుగు నెలలుగా అతను డ్రైవింగ్‌కు వెళ్లడం లేదు. నాలుగేళ్ల కిందటఅతని భార్య చనిపోవడంతో మద్యానికి బానిసయ్యాడు. రోజూ మాదిరిగానే గురువారం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. శుక్రవారం ఉదయం వరకూ ఇంటికి రాలేదు. దీంతో కుటుంబ సభ్యులు గాలించగా కాలువలో పడి మృతి చెందినట్టు గుర్తించారు. అతనికి ముగ్గురు పి ల్లలు ఉన్నారు. పెద్ద కుమారుడు హరికృష్ణ ఫిర్యాదు మేరకు గాజువాక సీఐ పార్థసారధి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కాలువలో పడి వ్యక్తి మృతి


