
స్ఫూర్తినింపిన ‘జనగణమన’
ఎంవీపీకాలనీ: భారత జాతీయ గీతం జనగణమన అధికారికంగా అమల్లోకి వచ్చి 75 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకొని యాక్మి సంస్థ ‘జనగణమన’ పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించింది. స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో భాగంగా 3 వేల మంది యువతను ఒకే వేదికపైకి తెచ్చి జాతీయగీతం జనగణమనను మూడు సార్లు ఆలపింపజేసింది. ఎంవీపీ కాలనీలోని ఏఎస్ రాజా మైదానం వేదికగా శుక్రవారం ఉదయం ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నగరంలోని వివిధ కళాశాలలకు చెందిన యువత ఉత్సాహంగా పాల్గొని ముక్తకంఠంతో జనగణమన ఆలపించి దేశభక్తిని చాటుకున్నారు. నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ జాతీయ గీతం ఓ స్ఫూర్తన్నారు. యాక్మి అధ్యక్షుడు ప్రతాప్ , సీఎంహెచ్‌వో నరేష్, రాహుల్, చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.

స్ఫూర్తినింపిన ‘జనగణమన’