
ఇటు మోడు.. అటు హరితహారం!
వాతావరణం చల్లబడింది. పైగా వీకెండ్..పర్యాటక ప్రియులు ఇక ఆగుతారా..కుటుంబాలతో సహా సాగరతీరాలకు క్యూ కట్టారు. విశాఖలోని సముద్ర తీరాలు ఆదివారం జనంతో కిటకిటలాడాయి. ఆదివారం ఆయా బీచ్‌లకు వేలాది మందిపర్యాటకులు తరలివచ్చారు. సాగర్‌నగర్ , రుషికొండ బీచ్, తొట్లకొండ బీచ్, భీమిలి, ఆర్కేబీచ్‌లో యువకులు, పిల్లలు,మహిళలు స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేశారు. ఫొటోలు తీసుకుంటూ సందడి చేశారు. – కొమ్మాది/బీచ్‌రోడ్డు
సుందర విశాఖలో ఎన్నో ప్రత్యేకతలు. రోడ్లకు ఇరువైపులా పచ్చదనంతో అలారారే చెట్లు ఒకపక్క అలరిస్తుంటాయి. అక్కడక్కడ వృద్ధాప్యంతో మోడు వారిని చెట్లు కూడా అగుపిస్తుంటాయి. వీటిని చూసిన వారికి ఒకింత ఆశ్చర్యం కలుగుతుంది. ఔరా! అనిపిస్తుంది. నగరంలోని శివాజీపాలెం పార్కుకు వెళ్లే రోడ్డులో పచ్చని చెట్లు హరిత హారంలా ఆకట్టుకుంటుంటే.. సూర్యాభాగ్‌లోని పోలీస్ కమిషనరేట్ వద్ద రోడ్డు పక్క ఉన్న ఎన్నో దశాబ్దాలుగా నీడనిస్తూ ఇప్పుడు మోడువారి పోయి దైన్యంగా చూస్తోంది. ఫొటోలు: సాక్షి ఫొటోగ్రాఫర్

ఇటు మోడు.. అటు హరితహారం!