విశాఖ సిటీ: విశాఖలో జంతువులపై నేరాలు, జంతు సంరక్షణ చట్టాల అమలకు నోడల్ అధికారిగా జోన్–2 ఏసీపీ(క్రైమ్) సిహెచ్.శ్యామలరావు నియమితులయ్యారు. రాష్ట్ర హైకోర్టు ఆదేశాల మేరకు నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ ఎ.రవిశంకర్ ఈ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు ఇచ్చారు. దీనిలో భాగంగా ఏసీపీ శ్యామలరావు కమిషనరేట్ పరిధిలో ఏసీపీలు, ఎస్‌హెచ్‌ఓలతో సమన్వయం చేసుకుంటూ, జంతు సంరక్షణ చట్టాలు సమర్ధవంతంగా అమలయ్యేలా పర్యవేక్షించాలని ఆదేశించారు. నగరంలో జంతు అక్రమ రవాణా, జంతు వధ నియంత్రణతో పాటు జంతు చట్టాలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. పండగల సీజన్లలో జంతువులను వధించడానికి రాష్ట్ర హైకోర్టు మార్గదర్శకాలతో స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు పాటించని వారిపై చర్యలు తీసుకోవాలన్నారు.