బాలల సమస్యలు బోలెడు | - | Sakshi
Sakshi News home page

బాలల సమస్యలు బోలెడు

Nov 17 2026 8:17 AM | Updated on Nov 17 2026 8:17 AM

కలెక్టరేట్‌లో ప్రత్యేక కార్యక్రమం తరలివచ్చినఆయా పాఠశాలల విద్యార్థులు కొందరు స్కూల్‌ సమస్యలపై.. ఇంకొందరు వ్యక్తిగత సమస్యలపై.. బెలూన్లు ఇచ్చి స్వాగతం పలికిన అధికారులు ఫిర్యాదులు స్వీకరించిన కలెక్టర్‌ దీపక్‌ తివారి

వికారాబాద్‌: బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా పాఠశాలల నుంచి అనేక మంది విద్యార్థులు వచ్చి తమ సమస్యలను వినిపించారు. కలెక్టర్‌ దీపక్‌తివారి, అడిషనల్‌ కలెక్టర్లు వెంకటాచారి, ఉమాశంకర్‌ ప్రసాద్‌ ఇతర అధికారులు బాలల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ముందుగా చిన్నారులకు కలెక్టర్‌ తోపాటు ఇతర అధికారులు బెలూన్లు ఇచ్చి స్వాగతం పలికారు. అనంతరం వారి నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. ప్రత్యేక హెల్ప్‌ డెస్కులు ఏర్పాటు సమస్యలు తెలుసుకున్నారు. మొత్తం 134 ఫిర్యాదులు, విన తులు వచ్చాయి. ఇందులో 13 ఫిర్యాదులు బాలలకు సంబంధింనవి. బాల కార్మికులు, బాల్య వివా హాలు,విద్యకు దూరమవడం, హక్కుల ఉల్లంఘన, వేధింపులు, పాఠశాల, వ్యక్తిగత సమస్యలపై ఫిర్యా దులు అందాయి. వీటిని సంబంధిత అధికారులు, శాఖలకు పంపి పరిష్కరిస్తామని కలెక్టర్‌ తెలిపారు.

చొరవ చూపాలి

బాలల ప్రజావాణికి వచ్చిన సమస్యలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష చేయాలని బాలల హక్కుల సంఘాలు,పేరెంట్స్‌ సంఘాలు సూచించా యి. పాఠశాలల్లో నెలకొన్న సమస్యలు, విద్యార్థులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వెంటనే పరిష్కరించేందుకు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరాయి.

జవాబుదారి పాలనే లక్ష్యం

అనంతగిరి: ప్రజలకు పారదర్శకమైన, జవాబుదారీతనంతో కూడిన పాలన అందించడమే లక్ష్యమని కలెక్టర్‌ దీపక్‌ తివారి అన్నారు. బాలల సంక్షేమం, ప్రజా సమస్యల పరిష్కారానికి జిల్లా యంత్రాంగం ప్రాధాన్యత ఇస్తోందని తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో ఆయన మాట్లాడారు. విద్యార్థుల సమస్యలు తెలుసుకొని పరిష్కరించేందుకు బాలల ప్రజావాణి కార్యక్రమం నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి మంచి స్పందన వచ్చిందన్నారు. విద్యార్థులు తమ దృష్టికి తెచ్చిన సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు.

‘బాలల ప్రజావాణి’కి అనూహ్య స్పందన

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement