ఆర్‌డీఓ వాసుచంద్ర
నవాబుపేట: భూముల రీ సర్వే ప్రక్రియ పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు వికారాబాద్ ఆర్‌డీ ఓ వాసుచంద్ర తెలిపారు. మండలంలోని ఎక్‌మామిడి గ్రామంలో కొనసాగుతున్న భూముల రీ సర్వే పనులను సోమవారం ఆయన పరిశీలించారు. సర్వేయర్ ఆనంద్ కుమార్‌తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రీ సర్వే తో భూ సమస్యలకు చక్కటి పరిష్కారం లభిస్తుందన్నారు. రైతులు దగ్గరుండి భూముల హద్దులు చూపాలన్నారు. కార్యక్రమంలో రెవె న్యూ డివిజనల్ ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే బుచ్చ య్య, డిప్యూటీ తహసీల్దార్ నవీన్ కుమార్ రెడ్డి, మండల సర్వేయర్ ఆనంద్ కుమార్, జీపీఓలు శ్రీశైలం, రాజు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి
పోటీలకు విద్యార్థులు
అనంతగిరి: మై భారత్ వికారాబాద్ జిల్లా ఆధ్వర్యంలో సోమవారం స్థానిక జిల్లా మెడికల్ కళాశాలలో నషా ముక్తి భారత్ అనే అంశంపై జిల్లాస్థాయి యువ పార్లమెంటు కార్యక్రమం నిర్వహించారు. ఈ అంశంపై వివిధ కళాశాలలకు చెందిన విద్యార్థులు పాల్గొని తమ అభిప్రాయాలను పార్లమెంటరీ చర్చ వేదికపై వ్యక్తం చేశారు. ఈ పోటీల్లో మొదటి బహుమతిని అనిత చౌదరి, రెండో బహుమతి దీపాన్షు, తృతీయ బహుమతి సుష్మా ప్రియ సాధించారు. వీరు తదుపరి నిర్వహించే రాష్ట్రస్థాయి యువ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొంటారని జిల్లా క్రీడల అధికారి నర్సింలు తెలిపారు. కార్యక్రమంలో మై భారత్ జిల్లా ప్రతినిధులు శ్రీశైలం, రవికుమార్, మైపాల్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ రామసుబ్బారెడ్డి, డాక్టర్ అనిత డాక్టర్ భవాని డాక్టర్ రఫియా సుల్తానా, భారతి తదితరులు పాల్గొన్నారు.
ఆ ఉత్తర్వులు నిలిపివేయాలి
తపస్ జిల్లా అధ్యక్షుడు సంతోష్ కుమార్
అనంతగిరి: ఉపాధ్యాయుల సర్దుబాటులో జరిగిన పొరపాట్లను సరిచేయాలని అప్పటివరకు ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలని తపస్ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంతోష్ కుమార్, గాజుల బస్వరాజ్ డిమాండ్ చేశారు. సోమవారం డీఈఓ అబ్దుల్ ఘనికిసంఘం తరఫున వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. జీవో 25 ప్రకారం పాఠశాల విద్యార్థుల నిష్పత్తి ఉపాధ్యాయుల కేటాయింపులో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి విద్యార్థుల సంఖ్య తక్కువ నుంచి ఎక్కువ వరకు సర్దుబాటు చేయాలని నిబంధనలు పాటించలేదన్నారు. కొన్ని మండలాల్లో ఇష్టానుసారంగా ఉపాధ్యాయులను పా ఠశాల నుంచి సర్దుబాటు పేరుతో సుదూర ప్రాంతాలను పంపడం, మరికొన్ని చోట్ల కావాలని దగ్గరికి పంపడం మరికొన్ని పాఠశాలలో సర్దుబాటు అవసరం ఉన్న అక్కడ మండల విద్యాధికారులుగుర్తించకపోవడం జరిగినట్లు ఉత్తర్వులను గమనిస్తే స్పష్టంగా తెలుస్తోందన్నారు. అంతేకాకుండా విద్యా సంవత్సరం మధ్యలో ఈ నిర్ణయంతో విద్యార్థులు ఉపాధ్యా యులు గందరగోళం నెలకొందన్నారు. తక్షణమే ఉత్తర్వులను నిలిపివేయాల ని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు ప్రసాద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు
నేటి నుంచి ధాన్యం కొనుగోళ్లు
కొడంగల్ రూరల్: పీఏసీఎస్ హస్నాబాద్ శాఖ ఆధ్వర్యంలో నేడు(మంగళవారం) వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించనున్నట్లు కార్యాలయ సిబ్బంది తెలిపారు. ఉదయం 10గంటలకు కొడంగల్‌లో, 10.30గంటలకు హస్నాబాద్‌లో, 11గంటలకు పెద్దనందిగామ గ్రామంలో కేంద్రాలను ప్రారంభించనున్నారు. రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.


