ప్రజా ప్రభుత్వం పేదల సొంతింటి కలను సాకారం చేస్తోందని స్పీకర్ ప్రసాద్‌కుమార్ అన్నారు. వికారాబాద్ మున్సిపల్ పరిధిలోని బూర్గుపల్లిలో ఓ లబ్ధిదారు పూర్తి చేసుకున్న ఇందిరమ్మ ఇంటిని శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. అభివృద్ధి, సంక్షేమాన్ని సమానంగా ముందుకు తీసుకువెళ్తోందన్నారు. ఇందిరమ్మ ఇల్లు పేదల ఆత్మగౌరవానికి ప్రతిక అన్నారు. అర్హులైన వారికి దశ లవారీ ఇళ్లు మంజూరు చేస్తామని హామీ ఇచ్చా రు. కార్యక్రమంలో జెడ్పీటీసీ మాజీ సభ్యుడు ముత్తాహార్ షరీఫ్ తదితరులు పాల్గొన్నారు.


