సాక్షి, రంగారెడ్డి జిల్లా: రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని, లేని పక్షంలో ఆందోళన చేపడతామని బీజేపీ రంగారెడ్డి అధ్యక్షుడు పంతంగి రాజభూపాల్గౌడ్ పేర్కొన్నారు. అబ్దుల్లాపూర్మెట్ మండలం బండరావిరాల, చిన్నరావిరాల, బాచారం, గౌరెల్లి గ్రామాల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను శుక్రవారం పార్టీ నాయకులతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ధాన్యం కొనుగోలు విషయంలో రైతులను ఇబ్బందులకు గురిచేయొద్దని అధికారులకు సూచించారు. రైతులకు బీజేపీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి అర్జున్ రెడ్డి, మండల అధ్యక్షుడు గోమారపు కొండల్ రెడ్డి, కిసాన్ మోర్చా మండల అధ్యక్షుడు సిల్వేరు అంజయ్య, కుంట్లూరు డివిజన్ అధ్యక్షుడు కొడతా వేమన, జిల్లా కార్యవర్గ సభ్యుడు శీలోజు శ్రవణ్ చారి, సీనియర్ నాయకుడు పాపయ్య గౌడ్, యువమోర్చా మండల అధ్యక్షుడు అంకుష్ ముదిరాజ్, ప్రధాన కార్యదర్శి కాశీనాథుని వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.


