విజ్ఞాన నిలయం | - | Sakshi
Sakshi News home page

విజ్ఞాన నిలయం

Nov 14 2026 7:51 AM | Updated on Nov 14 2026 7:51 AM

శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026 విజ్ఞాన నిలయం 8లోu

న్యూస్‌రీల్‌

నేటి నుంచి వారోత్సవాలు

నేటి నుంచి కార్యక్రమాలు

శనివారం శ్రీ 14 శ్రీ నవంబర్‌ శ్రీ 2026

వికారాబాద్‌: అజ్ఞానపు అంధకారం నుంచి విజ్ఞానపు జ్యోతి వెలిగించేవే గ్రంథాలయాలు. అందుకే వీటిని విజ్ఞాన భాండాగారాలని, ఆధునిక దేవాలయాలని పిలుస్తుంటారు. స్వాతంత్య్రోద్యమ కాలంలో అసంఘటితంగా ఉన్న ప్రజలను ఒక్కతాటిపైకి తెచ్చి.. వారిలో స్వాతంత్య్ర కాంక్ష రగిలించడంలో ముఖ్యపాత్ర పోషించాయి. గాడిచర్ల హరిసర్వోత్తమరావు, వట్టికోట ఆళ్వారుస్వామి.. తదితర మేధావులు గ్రంథాలయాల స్థాపనకు విశేషంగా కృషి చేశారు. డబ్బులున్నా అన్ని పుస్తకాలు కొనే వీలుండదు, ఈ క్రమంలో ప్రతి ఒక్కరికీ గ్రంథాలయాలు అవసరంగా మారాయి. అన్ని రకాల పాఠకుల అభిరుచులకు అనుగుణంగా పుస్తకాలను అందుబాటులో ఉంచుతున్నారు. ఆధునిక, సాంకేతికతను వినియోగించి ఇంటర్నెట్‌ ద్వారా చదువుకునే అవకాశం కూడా లైబ్రరీలు కల్పిస్తున్నాయి. నేటి సమాజంలో గ్రంథాలయాల అవసరం మరింత పెరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే నిరుద్యోగ యువతకు ఇవి కొండంత అండగా నిలుస్తున్నాయి. సంస్థ సైతం వారి అవసరాల మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థుల సంఖ్య పెరగడంతో ప్రత్యేకంగా షెడ్లు ఏర్పాటు చేసింది. ఆన్‌ డిమాండ్‌ బుక్స్‌ పేరిట ప్రత్యేక కార్యక్రమం అమలు చేస్తోంది. అభ్యర్థులకు ఏ పుస్తకం అవసరం ఉంటే ఆ పుస్తకం పేరు రిజిస్టర్‌లో రాయాలని సూచిస్తోంది. ఆ తర్వాత కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతోంది. నేటి నుంచి వారోత్సవాలు నిర్వహించనున్న నేపథ్యంలో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

అందుబాటులో 3.20లక్షల పుస్తకాలు

జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు మండలానికి ఒకటి చొప్పున 18 శాఖలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో 12,886 మంది సభ్యత్వం తీసుకున్నారు. 3.20 లక్షల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. రోజూ సగటున 3.26లక్షల మంది పాఠకులు గ్రంథాలయాలకు వచ్చి చదువుకొంటున్నారు. పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే వారి కోసం 40వేల పైచిలుకు పుస్తకాలు ఉన్నాయి. తాజాగా మరో 1,690 పుస్తకాలను కొనుగోలు చేశారు. జూనియర్‌ అసిస్టెంట్‌, కానిస్టేబుల్‌, టెట్‌ మొదలుకొని ఐఏఎస్‌, ఐపీఎస్‌ పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల కోసం అన్ని పుస్తకాలను ఉంచారు.

వేధిస్తున్న సిబ్బంది కొరత

మూడేళ్లుగా లైబ్రరీలకు పాఠకుల తాకిడి పెరిగింది. పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులు ఎక్కువగా వస్తుండటంతో ప్రత్యేక షెడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఉద్యోగులపై పనిభారం పెరిగింది. సిబ్బంది కొరత కూడా వేధిస్తోంది. జిల్లా కేంద్ర గ్రంథాలయంతో పాటు మరో 18 శాఖలు ఉన్నాయి. వీటిలో 38మంది విధులు నిర్వహించాల్సి ఉండగా ఏడుగురే అందుబాటులో ఉన్నారు. మిగతా పోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. జిల్లా సెక్రటరీ ఇతర జిల్లాలకు ఇన్‌చార్జిగా ఉండగా.. జిల్లాకు చెందిన మిగతా అన్ని చోట్ల ఇదే పరిస్థితి ఉంది. ఒక్కో ఉద్యోగి రెండు మూడు గ్రంథాలయాలకు ఇంచార్జిగా వ్యవహరించాల్సి వస్తోంది.

20వరకు వివిధ కార్యక్రమాలు

జిల్లాలో శాఖలు 18

సభ్యత్వం తీసుకున్నవారు 12,886

అందుబాటులో ఉన్న పుస్తకాలు 3.20లక్షలు

‘ఆన్‌ డిమాండ్‌ బుక్‌’ పేరిట ప్రత్యేక కార్యక్రమం

గ్రంథాలయాల ఆవశ్యకతను తెలియజేయడానికి, ప్రజలు, విద్యార్థుల్లో చైతన్యం కలిగించడానికి, పాఠకుల సంఖ్య పెంచేందుకు ఏటా నవంబర్‌ 14నుంచి 20వ తేదీ వరకు వారోత్సవాలు నిర్వహిస్తారు. వారం రోజులపాటు వివిధ కార్యక్రమాలు చేపడతారు. పాఠకులు, విద్యార్థులు, మహిళలను భాగస్వాములను చేస్తారు. విద్యార్థులకు వక్తృత్వ, వ్యాసరచన, క్విజ్‌, రంగోళి తదితర పోటీలు నిర్వహిస్తారు. విజేతలకు ఉత్సవాల ముగింపు రోజు బహుమతులు అందజేస్తారు. ఈ నెల 20న అక్షరాస్యతా దినోత్సవంతో వారోత్సవాలు ముగిస్తారు. స్పీ కర్‌ ప్రసాద్‌కుమార్‌, జిల్లా ఎమ్మెల్యేలు, కలెక్టర్‌, ఎస్పీ, గ్రంథాలయ సంస్థ చైర్మన్‌ తదితరులు కా ర్యక్రమాల్లో ముఖ్యఅతిథులుగా పాల్గొంటారు.

విజయవంతం చేయండి

పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే అభ్యర్థుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని జిల్లా గ్రంథాలయ సంస్థ ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అభ్యర్థులు ఫలానా పుస్తకం కావాలని రిజిస్టర్‌లో రాస్తే కొనుగోలు చేసి అందుబాటులో ఉంచుతున్నాం. ఇప్పటి వరకు రెండు వేలకుపైగా పుస్తకాలను కొనుగోలు చేశాం. వారోత్సవాల్లో పాఠకులు, ప్రజలు, విద్యావంతులు, నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలి.

– సురేష్‌బాబు, సెక్రటరీ, జిల్లా గ్రంథాలయ సంస్థ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement