మెథడిస్టు జాతరకు పోటెత్తిన భక్తులు
మెథడిస్టు క్రిస్టియన్ జాతరకు శుక్రవారం భక్తులు పోటెత్తారు. దాదాపు 50వేల మంది వచ్చినట్లు నిర్వాహకులు అంచనా వేశారు. దీంతో జాతర ప్రాంగణం సందడిగా మారింది. బీదర్ నుంచి ప్రత్యేక రైలు వచ్చింది. ఇతర ప్యాసింజర్ రైళ్లు, కర్ణాటక, మహారాష్ట్రల నుంచి ప్రత్యేక బస్సులు వచ్చాయి. జాతర కమిటీ కార్యదర్శి స్టీవెన్ ఏసుక్రీస్తు శాంతి సందేశం వినిపించారు. ప్రధాన శిలువ, ఇప్పచెట్టు మొదలు వద్ద భక్తులు ప్రార్థనలు చేశారు.
– ధారూరు


