పూడూరు: కేసీఆర్ పదేళ్ల పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, ఎనిమిది లక్షల కోట్లు అప్పులు ఉన్నా సీఎం రేవంత్‌రెడ్డి సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నారని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మన్నెగూడ జేకే ఫంక్షన్ హాల్‌లో కొత్తగా మంజూరైన చేయూత పింఛన్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారంటీలను పక్కాగా అమలు చేస్తామన్నారు. ఇప్పటికే అనేక హామీలు అమలు చేసినట్లు తెలిపారు. మహిళల పేరిట ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులు, గృహజ్యోతి పథకం ద్వారా ఉచిత విద్యుత్, ఉచిత బస్సు సౌకర్యం కల్పించినట్లు చెప్పారు. బీఆర్‌ఎస్ పాలనలో ఒక్క రేషన్‌కార్డు కూడా ఇవ్వలేదన్నారు. ఈ నెల 19న ఇందిరా గాంధీ జయంతి సందర్భంగా రేషన్ కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరికీ రూ.5 లక్షల బీమా పథకం వర్తిస్తుందన్నారు. రేడియల్, ట్రిపుల్ రోడ్లు పూర్తయితే ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. 508 మందికి కొత్త పింఛన్ ప్రొసీడింగ్ పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో డీసీసీ ఉపాధ్యక్షుడు ఆనందం, పీఏసీఎస్ చైర్మన్ పట్లోళ్ల రఘునాథరెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్ శ్రీనివాస్‌రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు సురేందర్, సర్పంచ్‌ల సంఘం మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌రెడ్డి, సర్పంచ్ తమన్నా అజీం పటేల్, నాయకులు షకీల్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి
పింఛన్ లబ్ధిదారులకు ప్రొసీడింగ్ పత్రాల అందజేత


