ఇరు వర్గాల ఘర్షణ | - | Sakshi
Sakshi News home page

ఇరు వర్గాల ఘర్షణ

Nov 14 2026 7:39 AM | Updated on Nov 14 2026 7:39 AM

ఇరు వర్గాల ఘర్షణ రెండు ఇసుక ట్రాక్టర్ల పట్టివేత ఉప్పరిగూడపీఏసీఎస్‌ పనితీరు భేష్‌ చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పునరుద్ధరించాలి

మోమిన్‌పేట: మండలంలోని కొత్త కోల్కుంద గ్రామంలో బుధవారం రాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎస్‌ఐ భరత్‌ భూషణ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామంలో తరచూ గొడవలు జరుగుతుండటంతో గురువారం రాత్రి ఇరువర్గాల వారని సీఐ వెంకట్‌ స్టేషన్‌ పిలిపించి కౌన్సిలింగ్‌ ఇచ్చారు. గొడవల విషయం, పోలీసుల తీరుపై గ్రామ సర్పంచ్‌ కీర్తి డీఎస్పీ అంజయ్యకి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత నేరుగా సీఐ కార్యాలయానికి వచ్చి మాకు న్యాయం జరగడం లేదంటూ నిరసనకు దిగారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ సీఐ కార్యాలయానికి వచ్చి త్వరలో న్యాయం జరిగేలా చూస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. అనవసరంగా నిరసనకు దిగిన సర్పంచ్‌పై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.

యాలాల: ఎలాంటి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను యాలాల పోలీసులు శుక్రవారం తెల్లవారుజామున పట్టుకున్నారు. ఎస్‌ఐ విఠల్‌రెడ్డి కథనం ప్రకారం.. మండలంలోని కాగ్నా నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టారు. జక్కేపల్లి, బెన్నూరు గ్రామాలకు చెందిన రెండు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకొని స్టేషన్‌కు తరలించారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ తెలిపారు.

ఇబ్రహీంపట్నం: శేరిగూడలోని ఉప్పరిగూడ పీఏసీఎస్‌ పనితీరు బాగుందని నాబార్డ్‌ డిప్యూటీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాకేష్‌ కశ్యప్‌ కితాబిచ్చారు. సొసైటీని శుక్రవారం సందర్శించిన ఆయన లాకర్స్‌, గోల్డ్‌ లోన్స్‌, ఓటర్‌ లిస్ట్‌, ఆన్‌లైన్‌లో కంప్యూటీకరణ తదితర అంశాలను స్వయంగా పరిశీలించారు. రైతులు తీసుకునే వివిధ రకాల రుణాల గురించి సొసైటీ సీఈఓ గణేశ్‌ ఆయనకు వివరించారు. ఈ సందర్భంగా రాకేష్‌ కశ్యప్‌ మాట్లాడుతూ.. పీఏసీఎస్‌లు రైతులకు అండగా నిలవాలని అన్నారు. నాబార్డ్‌ నుంచి ఎలాంటి ఆర్థిక సహకారం కావాలన్నా తప్పక చేస్తామన్నారు. కార్యక్రమంలో నాబార్డ్‌ చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ఉదయ్‌భాస్కర్‌, జనరల్‌ మేనేజర్‌ రమాదేవి, రాష్ట్ర కోఆపరేటివ్‌ సీజీఎం జ్యోతి, డీసీసీబీ హైదరాబాద్‌ సీఈఓ భాస్కర సుబ్రహ్మణ్యం, జనరల్‌ మేనేజర్‌ ఫణిశ్రీరాం, పీఏసీఎస్‌ చైర్మన్‌ ఎదుళ్ల పాండు రంగారెడ్డి, తుర్కయంజాల్‌ సీఈఓ రాందాసు పాల్గొన్నారు.

ఇబ్రహీంపట్నం: ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు కట్ట కింద కూల్చివేసిన చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని పునరుద్ధరించాలని రాష్ట్ర మత్స్యకారులు, మత్స్య కార్మిక సంఘం అధ్యక్షుడు గొరెంకల నర్సింహ డిమాండ్‌ చేశారు. శేరిగూడ సమీపంలో కూల్చివేసిన కేంద్రాన్ని సంఘం నాయకులతో కలిసి శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చేప పిల్లల ఉత్పత్తి కేంద్రాన్ని అధికారులు అనవసరంగా కూల్చివేశారని అన్నారు. వెంటనే ఈ కేంద్రాన్ని పునరుద్ధరించి చేప పిల్లల ఉత్పత్తిని ప్రారంభించాలని కోరారు. కూరగాయల మార్కెట్లో చేపల మార్కెట్లు నిర్మించాలన్నారు. ఎల్‌నినో ప్రభావంతో కరు వు పరిస్థితులు నెలకొన్నాయని, మత్స్యకారు లు వృత్తికి దూరమయ్యే ప్రమాదం ఉందన్నారు. మత్స్య సొసైటీల అకౌంట్లలో ప్రభు త్వం రూ.10 లక్షలు జమ చేయాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో సంఘం నాయకులు ఎన్‌.మల్లేష్‌, బి.నర్సింహ, టి.కృష్ణమూర్తి, బి.సాయి, ఎన్‌.అనురాధ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement