ఇబ్రహీంపట్నం రూరల్: తన పేరు మీద ఆస్తులు చేయకుంటే చంపేస్తానని బెదిరించి, దాడి చేసి, నానా భూతులు తిట్టిన కూమారుడిపై చర్యలు తీసుకోవాలని.. తమని రక్షించాలని వృద్ధ తల్లిదండ్రులు ఆదిభట్ల పోలీసులను ఆశ్రయించారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఆదిభట్ల డివిజన్‌కు చెందిన కుక్కల యాదిరెడ్డి (70), సువర్ణ దంపతులు. వీరిద్దరూ కొంత కాలంగా బ్రెయిన్‌స్ట్రోక్‌తో బాధపడుతున్నారు. వీరి కుమారుడు వెంకటేశ్వర్‌రెడ్డి నిత్యం మద్యం తాగి వచ్చి తల్లిదండ్రులను బెదిరించడంతోపాటు దాడి చేసి డబ్బులు లాక్కుంటున్నాడు. 2023లో ఆదిభట్లలో యాదిరెడ్డి పేరు మీద ఉన్న భూమిని బలవంతంగా గిఫ్ట్‌డీడ్ చేయించుకున్నాడు. ఈనెల 8న రాత్రి యాదిరెడ్డి దంపతులు ఇంటో ఉండగా వెంకటేశ్వర్‌రెడ్డి వచ్చి ఆస్తులన్నీ తన పేరుపై చేయాలని, లేకపోతే చంపుతానని బెదిరించాడు. వాకింగ్ స్టిక్‌తో తండ్రిని కొట్టి బెడ్రూంలోని అల్మారాలో ఉన్న కొంత డబ్బు, బంగారం తీసుకెళ్లాడు. మరుసటిరోజు ఉదయం మళ్లీ వచ్చి తల్లిని నానా భూతులు తిట్టాడు. తండ్రిపై దాడిచేయడంతోపాటు చంపుతానని బెదిరించి ఆయన పేరుతో ఉన్న ఒరిజినల్ డాక్యుమెంట్లు తీసుకెళ్లాడు. దీంతో వృద్ధ దంపతులు తమ కుమారుడి బారి నుంచి రక్షించాలని పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులను ఆశ్రయించిన తల్లిదండ్రులు


