పథకం ప్రకారమే భార్య హత్య | - | Sakshi
Sakshi News home page

పథకం ప్రకారమే భార్య హత్య

Nov 14 2026 7:39 AM | Updated on Nov 14 2026 7:39 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: పథకం ప్రకారం భార్యను హత్య చేసిన ఘటనలో నిందితుడిని ఆదిభట్ల పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. సీఐ రమేష్‌ కథనం ప్రకారం.. ఒడిశా రాష్ట్రం నబరంగ్పూర్‌ జిల్లాకుకు చెందిన ఉనిత పూజారి, గణేశ్యం పూజారి దంపతులు ముగ్గురు పిల్లలతో ఈనెల 7న కొంగరకలాన్‌లోని ఓ బ్రిక్స్‌ కంపెనీలో పని చేయడానికి వచ్చారు. ఒడిశాలో ఉన్న సమయంలో భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్నట్లు గణేశ్యం నిత్యం అనుమానిస్తుండేవాడు. ఆమెను మానసికంగా వేధిస్తుండేవాడు. తరచూ గొడవ పడి అత్తారింటికి పంపించేవాడు. ఈ క్రమంలో పెద్దమనుషుల సమక్షంలో మాట్లాడి మళ్లీ కాపురానికి పంపించారు. ఎలాగైనా భార్యను చంపాలని గణేశ్యం పథకం పన్నాడు. అన్నీ మర్చిపోయి హైదరాబాద్‌లో పని చేసుకొని బతుకుదామని నమ్మబలికి కొంగరకలాన్‌లోని ఇటుక బట్టీలోకి తీసుకొచ్చాడు. ఈనెల 11న రాత్రి భార్య బహిర్భూమి కోసం అటవీ ప్రాంతంలోకి వెళ్లగా ఇదే అదనుగా వెంట వెళ్లి చున్నీని ఆమె మెడకు బిగించి ఊపిరాడకుండా చేసి హత్య చేశాడు. అటవీ ప్రాంతం నుంచి ఒక్కడే రావడం గమనించిన సూపర్‌వైజర్‌ ప్రశ్నించగా తడబడ్డాడు. అంతా కలిసి నిలదీయడంతో నేరం అంగీకరించాడు. పోలీసులకు ఫిర్యాదు చేయగా నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్‌కు తరలించారు. మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

నిందితుడిని అరెస్టు చేసి ఆదిభట్ల పోలీసులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement