అదుపు తప్పి ఆర్మీ జవాన్ల వాహనం బోల్తా | - | Sakshi
Sakshi News home page

అదుపు తప్పి ఆర్మీ జవాన్ల వాహనం బోల్తా

Nov 14 2026 7:39 AM | Updated on Nov 14 2026 7:39 AM

చేవెళ్ల: ఆర్మీ ట్రైనింగ్‌లో భాగంగా వెళ్తున్న ఆర్మీజవాన్ల వాహనం ప్రమాదవశాత్తు అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో వాహనంలో ఉన్న 14 మంది జవాన్‌లలో 8 మందికి గాయాలయ్యాయి. ఈ సంఘటన అల్లవాడ బస్‌స్టేజీ సమీపంలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన కథనం ప్రకారం.. ఆర్మీ జవాన్‌లు ట్రైనింగ్‌లో భాగంగా శుక్రవారం ఉదయం నగరంలోని గోల్కొండ ఆర్మీ క్యాంపు నుంచి చేవెళ్ల మీదుగా షాబాద్‌ మండలం వైపు వెళ్తున్నారు. వారు వెళ్తున్న వాహనం ప్రమాదవశాత్తు రోడ్డుపక్కన ఉన్న డివైడర్‌ను ఢీకొని అవతలివైపు వెళ్లి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వారి వెనకాలే వస్తున్న ఇతర ఆర్మీ జావాన్‌లు స్పందించి ప్రమాదానికి గురైన వాహనంలో నుంచి అందరినీ బయటకు తీశారు. అంబులెన్స్‌కు సమాచారం అందించటంతో షాబాద్‌ మండలంలోని నాగరగూడలోని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అక్కడ వైద్యులు లేకపోవడంతో షాద్‌నగర్‌ ఆస్పత్రికి అక్కడి నుంచి ఆర్మీ గోల్కొండ ఆస్పత్రికి తరలించినట్లు సమాచారం. ఈ ప్రమాదంపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు.

పలువురు జవాన్లకు గాయాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement