రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదాలను నివారిద్దాం

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

ఇబ్రహీంపట్నం రూరల్‌: రోడ్డు మరణాలు లేని జిల్లాగా తీర్చిదిద్దడానికి అన్ని శాఖలు సమన్వయంతో కృషి చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్‌ఓ) శారదాదేవి పిలుపునిచ్చారు. జిల్లా రవాణా శాఖ ఆధ్వర్యంలో గురువారం సేఫ్‌లైఫ్‌ ఫౌండేషన్‌ సహకారంతో జీరో ఫాటాలిటీ డిస్ట్రిక్ట్స్‌ కార్యక్రమంపై కలెక్టరేట్‌లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా శారదాదేవి, డిప్యూటీ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌ అఫ్రీన్‌ సిద్దిఖీ మాట్లాడుతూ.. ప్రమాదాలు అధికంగా జరిగే ప్రాంతాలను బ్లాక్‌ స్పాట్స్‌గా గుర్తించాలని అన్నారు. రోడ్డు భద్రత ప్రమాణాల అమలు, ప్రమాద బాధితులకు సత్వర వైద్య సహాయం అందించే అత్యవసర స్పందన వ్యవస్థలను బలోపేతం చేయాలన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణకు వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని, ప్రమాదాలు జరిగే ప్రాంతాలను శాసీ్త్రయంగా విశ్లేషించి తగిన చర్యలు చేపట్టాలని సూచించారు. రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కార్యక్రమంలో జిల్లా రవాణా అధికారి కె. వాసుదేవరావు, రోడ్లు, భవనాల శాఖ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ రణేష్‌, రోడ్డుసేఫ్టీ కన్సల్టెంట్‌ ధన్‌రాజ్‌గౌడ్‌, అసిస్టెంట్‌ మోటారు వెహికల్‌ ఇన్‌స్పెక్టర్లు సాయిశృతి, స్వాతి, రాఘవులు తదితరులు పాల్గొన్నారు.

జిల్లా రెవెన్యూ అధికారి శారదాదేవి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement