● బీఎస్ఏ అవార్డులకు ముగ్గురి ఎంపిక
● 15న ఢిల్లీలో సత్కారం పొందనున్న కళాకారులు
బహుజన సాహిత్య అకాడమి(బీఎస్ఏ) నేషనల్ కాన్ఫరెన్స్ అవార్డులకు జిల్లా నుంచి ముగ్గురు కళాకారులు ఎంపికయ్యారు. ఈనెల 15న దేశ రాజధాని ఢిల్లీలో అవార్డులు అందుకోనున్నారు. 26 రాష్ట్రాల నుంచి సుమారు వెయ్యిమంది ప్రముఖులు ఈకార్యక్రమానికి హాజరుకానున్నారు.
– బొంరాస్పేట/దోమ
కృష్ణయ్యకు ‘పూలే’
మహత్మా జ్యోతిరావు ఫూలే అవార్డుకు బొంరాస్పేట మండలం రేగడిమైలారానికి చెందిన కృష్ణయ్య ఎంపికయ్యారు. ఇరవై ఐదేళ్లుగా జానపద సంగీతంలో తన ప్రతిభను చాటుతూ కీబోర్డు, సన్నాయి వాయిద్యాలను అలవోకగా వాయిస్తూ ఆకట్టుకుంటున్నారు. పొట్టిశ్రీరాములు తెలు గు విశ్వవిద్యాలయంలో సంగీత శిక్షణ పొందారు. తెలగాణ జానపద కళాకారు ల సంఘం జిల్లా అధ్యక్షుడిగా సేవలందిస్తున్నారు.


