కుటుంబ కలహాలతో మనోవేదన | - | Sakshi
Sakshi News home page

కుటుంబ కలహాలతో మనోవేదన

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

● చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు వీడియోకాల్‌

● బెల్టుతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య

ఇబ్రహీంపట్నం రూరల్‌: కుటుంబ కలహాలతో మనోవేదనకు గురై ఓ వ్యక్తి బెల్టుతో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రమేష్‌ కథనం ప్రకారం.. యాచారం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన దూదిమెట్ల శంకర్‌ యాదవ్‌ (26) డ్రైవర్‌గా పని చేస్తున్నాడు. కుటుంబ కలహాలతో మనోవేదనకు గురై గురువారం రాత్రి ఇంట్లో నుంచి వచ్చాడు. కుటుంబ సభ్యులకు వీడియో కాల్‌ చేసి చనిపోతున్నానని చెప్పి ఇంజాపూర్‌ సమీపంలో నీలాద్రి నగర్‌ సమీపంలో ఓ చెట్టుకు బెల్టుతో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. లొకేషన్‌ ఆధారంగా సంఘటనా స్థలానికి చేరుకునే లోపే శంకర్‌యాదవ్‌ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement