ఉత్సాహంగా యువజనోత్సవాలు | - | Sakshi
Sakshi News home page

ఉత్సాహంగా యువజనోత్సవాలు

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

ఉత్సాహంగా యువజనోత్సవాలు

జ్యోతి ప్రజ్వలన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తున్న అతిథులు

జానపద నృత్య పోటీల్లో పాల్గొన్న యువతులు

హుడాకాంప్లెక్స్‌: జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో గురువారం సరూర్‌నగర్‌ ఇండోర్‌ స్టేడియంలో జిల్లాస్థాయి యువజనోత్సవాలు నిర్వహించారు. జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్‌.స్వర్ణలత అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి స్పోర్ట్స్‌ అథారిటీ డిప్యూటీ కలెక్టర్‌ కె.అనూష ముఖ్య అతిథిగా, యువజన సేవల శాఖ జనరల్‌ మేనేజర్‌ కె.వేణుగోపాల్‌రావు గౌరవ అతిథిగా హాజరయ్యారు. జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. యువతలో దాగి ఉన్న కళా నైపుణ్యాలను వెలికితీయడం, సాంస్కృతిక సంప్రదాయాలను ప్రోత్సహించడం, జాతీయస్థాయి పోటీలకు ప్రతిభావంతులైన యువకళాకారులను ఎంపిక చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఇలాంటి కార్యక్రమాల ద్వారా యువత తమ ప్రతిభను రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శించేందుకు మంచి అవకాశాలు లభిస్తాయన్నారు. యువజనోత్సవాల్లో జానపద నృత్యం, కవితా రచన, చిత్రలేఖనం తదితర విభాగాల్లో 300 మందికి పైగా యువతీ యువకులు ఉత్సాహంగా పాల్గొన్నారు. వివిధ కళారూపాల్లో తమ ప్రతిభను ప్రదర్శించారు. పోటీలకు జ్వాలాముఖి, రాధిక, రాకేష్‌ భవాని న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. ప్రతిభ కనబర్చిన వారికి బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement