యువతుల అదృశ్యం | - | Sakshi
Sakshi News home page

యువతుల అదృశ్యం

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

యువతుల అదృశ్యం

చేవెళ్ల: రాత్రి ఇంట్లో తల్లిదండ్రులతోపాటు కలిసి నిద్రించిన యువతి ఉదయం లేచి చూసే సరికి కనిపించకుండా పోయింది. ఈ సంఘటన చేవెళ్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని ముడిమ్యాల శివారులో ఉన్న ఓ ఫాంహౌస్‌లో అర్షియా సల్మాని కుటుంబం నివాసం ఉంటోంది. ఆమె కూతురు కెహ్రెబా సల్మాని (22) బుధవారం రాత్రి కుటుంబసభ్యులతో కలిసి నిద్రపోయింది. తల్లి తెల్లవారుజామున 5 గంటలకు నిద్రలేచి చూసే సరికి కనిపించలేదు. ఫోన్‌ స్విచ్ఛాఫ్‌ వచ్చింది. ఆమెకోసం చుట్టుపక్కల, తెలిసిన వారి వద్ద వెతికినా ప్రయోజనం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫాంహౌస్‌లో పనిచేసే ఎండీ సర్పరాజ్‌ కూడా రెండురోజులుగా పనికి రావటం లేదని, అతనిపైనే అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

మరో ఘటనలో..

పహాడీషరీఫ్‌: యువతి అదృశ్యమైన సంఘటన పహాడీషరీఫ్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. తుక్కుగూడ సర్దార్‌నగర్‌ గ్రామానికి చెందిన బుసనగిరి నర్సింహ కుమార్తె శృతి (21) పదో తరగతి వరకు విద్యనభ్యసించి ఇంటి వద్దే ఉంటోంది. ఈ నెల 10న రాత్రి కుటుంబ సభ్యులతో కలిసి ఇంట్లో నిద్రించిన నామె మరుసటి రోజు లేచి చూసేసరికి కనిపించలేదు. ఆచూకీ కోసం స్థానికంగా గాలించినా ఫలితం లేకపోవడంతో తండ్రి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సమాచారం అందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement