ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఫైర్‌ | - | Sakshi
Sakshi News home page

ప్లాస్టిక్‌ పరిశ్రమలో ఫైర్‌

Nov 13 2026 8:33 AM | Updated on Nov 13 2026 8:33 AM

షాద్‌నగర్‌: షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఈ సంఘటన నందిగామ మండల కేంద్రంలో ఉన్న ఎస్‌కే ప్లాస్టిక్‌ పరిశ్రమలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. రాజ్‌కమల్‌ ఇండస్ట్రీలో ప్లాస్టిక్‌తో కుర్చీలు, టేబుళ్లు, గంపలు తయారు చేస్తున్నారు. గురువారం సాయంత్రం పరిశ్రమలో షార్ట్‌ సర్క్యూట్‌తో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా పరిశ్రమ అంతటా వ్యాపించడంతో ప్లాస్టిక్‌తో తయారు చేసిన సామగ్రి, వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయి. పరిశ్రమలో దట్టమైన మంటలు, పొగ వ్యాపించడంతో కార్మికులు భయాందోళనకు గురై బయటికి పరుగులు పెట్టారు. ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. విషయం తెలుసుకున్న సీఐ వీరబాబు సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకున్నారు. షాద్‌నగర్‌ నుంచి అగ్నిమాపక శకటాలు ఘటానికి స్థలానికి చేరుకొని మంటలు ఆర్పేశాయి. రూ.కోట్లలో ఆస్తి నష్టం జరిగి ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఘటనకు సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు.

కాలి బూడిదైన సామగ్రి, యంత్రాలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement