రైతు సంక్షేమానికి కృషి చేయండి | - | Sakshi
Sakshi News home page

రైతు సంక్షేమానికి కృషి చేయండి

Nov 12 2026 11:42 AM | Updated on Nov 12 2026 11:42 AM

అనంతగిరి: రైతు సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పీకర్‌ ప్రసాద్‌ కుమార్‌ అన్నారు. బుధవారం శివారెడ్డిపేట్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా బిల్లపాటి రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. సహకార సంఘాలను బలోపేతం చేస్తూ, రైతులకు మెరుగైన సేవలందించాలని నూతన చైర్మన్‌కు సూచించారు. సకాలంలో ఎరువులు, విత్తనాలు, రుణాలు అందేలా చూడాలన్నారు. అనంతరం చైర్మన్‌ రాజశేఖర్‌ రెడ్డి మాట్లాడుతూ.. అన్నదాతల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని తెలిపారు. వైస్‌ చైర్మన్‌గా మల్లేశం గౌడ్‌, సభ్యులుగా ధర్మపురం నాగేంద్రమ్మ, మాచాల సరిత, సంగప్ప, రమేశ్‌, పట్లోళ్ల ప్రభాకర్‌ రెడ్డి, ఎండీ నైముద్దీన్‌, బోరెడ్డి రవీందర్‌ రెడ్డి, చాకలి భుజంగం, కొత్తగాడి నర్సింలు, ధన్నారం నర్సింలు, గోవింద్‌ దాస్‌ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యుడు రంగరాజు, వికారాబాద్‌ ఏఎంసీ చైర్మన్‌ శ్రీనివాస్‌, వైస్‌ చైర్మన్‌ మల్లేశం, మున్సిపల్‌ మాజీ చైర్మన్‌ సత్యనారాయణ, మాజీ వైస్‌ చైర్మన్‌ చిగుళ్లపల్లి రమేష్‌ కుమార్‌, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు మైపాల్‌ రెడ్డి, ముత్తాహర్‌ షరీఫ్‌, కౌన్సిలర్లు లంకా లష్మికాంత్‌ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

స్పీకర్‌ ప్రసాద్‌కుమార్‌

శివారెడ్డిపేట్‌ పీఏసీఎస్‌ చైర్మన్‌గా రాజశేఖర్‌రెడ్డి ప్రమాణ స్వీకారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement