● అంతవరకూ మా భూముల జోలికి రావొద్దు
● తిమ్మాయిపల్లిలో అధికారులను అడ్డుకున్న రైతులు
కందుకూరు: పరిహారం ఇచ్చే వరకు భూముల జోలికి రావద్దని మండల పరిధిలోని తిమ్మాయిపల్లి రైతులు డిమాండ్ చేశారు. ఫ్యూచర్ సిటీలో భాగంగా తిమ్మాయిపల్లి సర్వే నంబర్ 9, 15లోని భూముల సేకరణకు అధికారులు గతంలో నోటిఫికేషన్ జారీ చేసి, చాలా మందికి పరిహారం అందించారు. రెండు నంబర్లలో కబ్జాలో ఉన్న పలువురు రైతులకు పరిహారం అందలేదు. ఇదిలా ఉండగా, బుధవారం పోలీసు బందోబస్తు మధ్య రెవెన్యూ అధికారులు ఆ భూములను చదును చేసే పనులు చేపట్టగా రైతులు అడ్డుకున్నారు. విషయం తెలుసుకున్న ఇన్‌ఛార్జ్ తహసీల్దార్ వేణుగోపాల్, సీఐ వెంకటేశ్వర్లు తదితరులు స్థానిక సర్పంచ్ సురేష్‌నాయక్, ఉప సర్పంచ్ పద్మకృష్ణ తదితరులు గ్రామ పంచాయతీ కార్యాలయంలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిహారం ఇచ్చాకే పనులు చేపట్టాలని రైతులు తేల్చిచెప్పారు. విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో నిర్వాసితులు శాంతించారు.


