మోమిన్‌పేట: మోమిన్‌పేట మండలాన్ని కరువు ప్రాంతంగా ప్రకటించి రూ.200 కోట్లు కేటాయించాలని ఆల్ ఇండియా రైతు సంఘం జిల్లా కార్యదర్శి మైపాల్ డిమాండ్ చేశారు. రైతు సమస్యల పరిష్కారం కోసం ఈ నెలలో నల్లగొండలో నిర్వహించనున్న బహిరంగ సభ వాల్ పోస్టర్‌ను మంగళవారం మండల కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్‌నినో ప్రభావంలో వర్షాలు పడక పంటలు దెబ్బతిని రైతులు నానా అవస్థలు పడుతున్నారని తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మోమిన్‌పేటను కరువు ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. రైతులు, రైతు కూ లీలకు ఉపాధి చూపించాలని కోరారు. వీబీజీరాంజీ పథకంలో 200రోజుల పని కల్పించాలన్నారు. రైతు సమస్యలపై పోరాడేందుకు ఉద్యమ కార్యాచరణ రూపొందించడం జరుగుతుందన్నారు. ప్రతిఒక్కరూ బహిరంగ సభకు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు.


