ఎఫ్‌ఎంజీల అరెస్టుతో తీవ్ర ఉద్రిక్తత | - | Sakshi
Sakshi News home page

ఎఫ్‌ఎంజీల అరెస్టుతో తీవ్ర ఉద్రిక్తత

Nov 11 2026 9:22 AM | Updated on Nov 11 2026 9:22 AM

ఎఫ్‌ఎంజీల అరెస్టుతో తీవ్ర ఉద్రిక్తత

● పలువురికి స్వల్ప గాయాలు

సుల్తాన్‌బజార్‌: భారతీయ విద్యార్థులతో సమానంగా పారితోషకం చెల్లించాలని గత 34 రోజులుగా నిరసన, ఐదు రోజులుగా రిలే నిరహార దీక్ష చేస్తున్న తెలంగాణ ఫారిన్‌ మెడికల్‌ గ్రాడ్యుయేట్‌(ఎఫ్‌ఎంజీ) ఆందోళన, పోలీసుల అరెస్టులతో తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సుల్తాన్‌బజార్‌ పోలీసులు బలవంతంగా అరెస్టు చేసేందుకు రావడంతో వారు మండిపడ్డారు. పోలీసులు, ఎఫ్‌ఎంజీల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. దాదాపు 100 మంది బైఠాయించడంతో పోలీసులు వారిని అరెస్టు చేసి వ్యాన్లలో బలవంతంగా ఎక్కించే సమయంలో తీవ్ర తోపులాట చోటు చేసుకుంది. ఈ క్రమంలో ఇద్దరు ఎఫ్‌ఎంజీలు గాయపడంతో వారిని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మిగతా వారిని మలక్‌పేట్‌, సైదాబాద్‌, డబిర్‌పురా పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఎఫ్‌ఎంజీలు మాట్లాడుతూ... డీఎంఈకి వినతి పత్రం సమర్పించేందుకు వెళ్తుండగా పోలీసులు తమను అక్రమంగా అరెస్టు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జనవరి నుంచి పెండింగ్‌లో ఉన్న బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement