● వర్ధంతి సభలో మంత్రి జూపల్లి
గన్ ఫౌండ్రి: ప్రజాకవి అందెశ్రీ రచనలు, పాటలు తెలంగాణ చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతాయని రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మంగళవారం రవీంద్ర భారతిలో తెలంగాణ భాష సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో కవి అందెశ్రీ వర్ధంతి సభ నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమ సమయంలో తన రచనలు, పాటల ద్వారా స్ఫూర్తిని నింపిన వ్యక్తి అందెశ్రీ అని కొనియాడారు. కార్యక్రమంలో తెలంగాణ సాంస్కృతిక సారథి చైర్పర్సన్ వెన్నెల గద్దర్, పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ చరణ్ కౌశిక్ యాదవ్, అరుణోదయ విమలక్క, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి తదితరులు పాల్గొన్నారు.


