సాక్షి, సిటీబ్యూరో: తెలంగాణ కార్పొరేట్ ప్రీమియర్ లీగ్(టీసీపీఎల్) 4వ సీజన్ లోగో, వెబ్‌సైట్‌ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంగళవారం ఆవిష్కరించారు. కార్పొరేట్ ఉద్యోగుల క్రీడా నైపుణ్యాన్ని వెలికితీసేందుకు, పని ఒత్తిడి లేని వాతావరణాన్ని అందించేందుకు ఈ టీ20 క్రికెట్ టోర్నమెంట్‌ను 7హెచ్ స్పోర్ట్స్ ఫౌండర్ వెంకటేశ్ రూపొందించారు. 4వ సీజన్‌ను ఫిబ్రవరిలో నిర్వహించనున్నామని ఆయన తెలిపారు. మూడు సీజన్లలో 130పైగా కార్పొరేట్ కంపెనీల నుంచి 500 మందికి పైగా ఉద్యోగులు పాల్గొన్నారని చెప్పారు. కార్యక్రమంలో గ్రీన్ ఇండియా చాలెంజ్ సహ వ్యవస్థాపకులు రాఘవేంద్ర యాదవ్ పాల్గొన్నారు.


