బండ్లగూడ: రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలడంతో ఓ నివాసంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. బైరాగిగూడలోని శివసాయినగర్ కాలనీ లేన్ నంబర్ 4లో ఈ ఘటన జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం శివసాయినగర్‌లో శ్రీకాంత్, తన భార్యతో కలిసి ఉంటున్నాడు. మంగళవారం ఉదయం ఇరువురు ఉద్యోగాలకు వెళ్లారు. రిఫ్రిజిరేటర్ కంప్రెషర్ పేలడంతో మంటలు వ్యాపించాయి. గంట తరువాత స్థానికులు శ్రీకాంత్‌కు ఫోన్ చేసి మంటలు వస్తున్నాయని తెలపడంతో వెంటనే ఇంటికి చేరుకున్నారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఇంట్లో ఉన్న ఫర్నిచర్, విలువైన వస్తువులు కాలిపోయాయి. షార్ట్ సర్కూట్ కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చునని భావిస్తున్నారు.


