ఉగ్రమూలాల కేసులో నిందితురాలికి బెయిల్‌ | - | Sakshi
Sakshi News home page

ఉగ్రమూలాల కేసులో నిందితురాలికి బెయిల్‌

Nov 11 2026 9:22 AM | Updated on Nov 11 2026 9:22 AM

ఉగ్రమూలాల కేసులో నిందితురాలికి బెయిల్‌ ఆన్‌లైన్‌లో కత్తి కొని.. స్నేహితుడిని హతమార్చి రాంగ్‌ రూట్‌తో మరొకరి జీవితం ఎండ్‌! శాట్జ్‌, టీఓఏ విభేదాలతో నష్టపోతున్న క్రీడాకారులు

కంబాలచెరువు(రాజమహేంద్రవరం): విజయవాడలో ఉగ్రమూలాలున్నాయనే కోణంలో అరెస్టయిన కేసులో మంగళవారం సయిదాబేగంకు బెయిల్‌ మంజూరైంది. ఈ ఏడాది మార్చిలో విజయవాడ కేంద్రంగా ఉగ్రమూలాలున్న వ్యక్తులపై దాడుల చేసిన ఎన్‌ఐఏ 11 మందిని అరెస్టు చేసింది. వారందరూ రాజమహేంద్రవరం సెంట్రల్‌ జైలులో రిమాండ్‌ ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. వారిలో దిల్‌ఖుష్‌ బెయిల్‌పై ఆదివారం విడుదలయ్యాడు. ఈ కేసులో ఏ5గా ఉన్న హైదరాబాద్‌కు చెందిన సయిదా బేగం బెయిల్‌పై విడుదలైంది.

● నిందితుడిని రిమాండ్‌కు

తరలించిన పోలీసులు

బంజారాహిల్స్‌: తనపై దాడి చేశాడన్న కోపంతో కక్ష పెంచుకున్న యువకుడు రెండు నెలల క్రితం ఆన్‌లైన్‌లో కత్తి కొని అదును చూసి స్నేహితుడిని హతమార్చాడు. వివరాల్లోకి వెళితే.. బంజారాహిల్స్‌ రోడ్డు నంబర్‌–2లోని షౌకత్‌నగర్‌లో నివసించే ఐమన్‌పాషా(24), అదే బస్తీలో నివసించే ఫరూఖ్‌(28)లు స్నేహితులు. ఇద్దరూ మద్యం తాగి జల్సాలు చేస్తుండేవారు. దొంగతనాలు, బెదిరింపులకు పాల్పడేవారు. రెండు నెలల క్రితం మద్యం మత్తులో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఫరూఖ్‌ తన వీపులో కత్తితో దాడి చేశాడని, అదే విధంగా దాడి చేయాలని ఐమన్‌పాషా కక్ష పెంచుకున్నాడు. ఇందుకోసం రెండు నెలల క్రితమే ఆన్‌లైన్‌లో కత్తి కొనుగోలు చేశాడు. ఫరూఖ్‌ కదలికలపై రెండు నెలలుగా దృష్టిపెట్టి అదును కోసం వేచిచూశాడు. ఈ నెల 8న ఫరూఖ్‌ సాగర్‌ సొసైటీ చౌరస్తాలోని టపాసుల దుకాణానికి వచ్చాడని తెలిసి ఐమన్‌పాషా మాటువేశాడు. కత్తితో ఫరూఖ్‌ వీపులో గట్టిగా పొడిచి హత్య చేసి అనంతరం బంజారాహిల్స్‌ పోలీసులకు లొంగిపోయాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారించారు. ఐమన్‌పాషాపై అల్లాపూర్‌, బంజారాహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధుల్లో రెండు హ త్య కేసులు నమోదైనట్లు గుర్తించారు. దారి దోపి డీకి పాల్పడినట్లు మరో కేసు నమోదైంది. హత్య కు గురైన ఫరూఖ్‌పై కూడా దారి దోపిడీ, హత్యాయత్నం కేసులు నమోదైనట్లు తేలింది. నిందితుడు ఐమన్‌పాషాను బంజారాహిల్స్‌ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

● రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతిపై సీపీ సజ్జనార్‌ పోస్టు

సాక్షి, సిటీబ్యూరో: ‘కేవలం రెండు నిమిషాలు ఆదా చేసుకోవాలనే తొందరపాటు.. ఎవరింటి దీపాన్నో ఆర్పేస్తోంది. సమాజంలో బాధ్యతగా ఉండాల్సిన విద్యావంతులే ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించకపోవడం అత్యంత బాధాకరం, క్షమించరాని నేరం! గుర్తుంచుకోండి.. మీరు తీసుకునే రాంగ్‌ రూట్‌.. మరొకరి జీవితానికి రాంగ్‌ ఎండ్‌ కాకూడదు’ అంటూ నగర పోలీసు కమిషనర్‌ విశ్వనాథ్‌ చన్నప్ప సజ్జనర్‌ మంగళవారం ఆవేదనతో ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. సోమవారం నల్లకుంట పోలీసుస్టేషన్‌ పరిధిలో ఇంజనీరింగ్‌ విద్యార్థిని షేక్‌ ఆయేషా ముస్ఫిరా(21) మృతి చెందిన ఘటనను ఉటంకిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు. కుమార్తెను తండ్రి మహ్మద్‌ ఆరీఫ్‌ ద్విచక్రవాహనంపై కళాశాలకు తీసుకెళ్తుండగా.. బ్యాంకు ఉద్యోగి బీఎం ధర్మరాజు రాంగ్‌ రూట్‌లో ద్విచక్ర వాహనంపై వేగంగా దూసుకొచ్చాడు. ఆరీఫ్‌తో ఒక్కసారిగా బ్రేక్‌ వేయడంతో కిందపడిన ఆయేషా తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెనుక చక్రాలు వెళ్లడంతో అక్కడికక్కడే కన్నుమూసింది. ప్రమాదానికి కారణమైన ధర్మరాజును పోలీసులు అరెస్ట్‌ చేశారు. ‘బాధ్యతగల హోదాలో ఉన్న ఓ బ్యాంకు ఉద్యోగి రాంగ్‌ రూట్‌.. ఉజ్వల భవిష్యత్తు వైపు అడుగులేస్తున్న 21 ఏళ్ల ఇంజినీరింగ్‌ విద్యార్థిని జీవిత ప్రయాణాన్ని నడిరోడ్డుపై శాశ్వతంగా ముగించేసిందని’ కొత్వాల్‌ పేర్కొన్నారు.

సాక్షి, సిటీబ్యూరో: స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ (శాట్జ్‌), తెలంగాణ ఒలింపిక్‌ సంఘా(టీఓఏ)లో రాజకీయ విభేదాలతో క్రీడాకారులు నష్టపోతున్నారని శాట్‌ మాజీ ఛైర్మన్‌ అల్లీపురం వెంకటేశ్వర్‌రెడ్డి ఒక ప్రకటనలో ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వ స్పోర్ట్స్‌ బోర్డు సభ్యుడు, అర్జున అవార్డు గ్రహీత రవికాంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణలో క్రీడా రంగం దుస్థితికి అద్దం పడుతున్నాయన్నారు. ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ దగ్గర పడుతుంటే, శాట్జ్‌, టీఓఏలో అంతర్గత విభేదాలతో క్రీడాకారులకు తీవ్ర నష్టం జరుగుతోందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement