సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు | - | Sakshi
Sakshi News home page

సీఎంకు జన్మదిన శుభాకాంక్షలు

Nov 10 2026 8:27 AM | Updated on Nov 10 2026 8:27 AM

అనంతగిరి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ మెంబర్‌ రంగరాజు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొడంగల్‌ పర్యటనలో ఉన్న సీఎంను ఆదివారం మర్యాదపూర్వకంగా కలిసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

రామలింగేశ్వరుడినిదర్శించుకున్న జడ్జి శిల్ప

కుల్కచర్ల: మండలంలోని బండవెల్కిచర్ల గ్రా మ పరిధి పాంబండ రామలింగేశ్వరుడిని సో మవారం పరిగి కోర్టు న్యాయమూర్తి శిల్ప దంపతులు దర్శించుకున్నారు.స్వామివారికి ప్రత్యే క పూజలు నిర్వహించారు.ఆలయ కమిటీ చై ర్మన్‌ కోట్ల మైపాల్‌రెడ్డి,అర్చకుడు దశరథం వా రిని సన్మానించి తీర్థప్రసాదాలు అందజేశారు.

రాష్ట్రస్థాయి పోటీలకు

గురుకుల విద్యార్థి

కొడంగల్‌ రూరల్‌: రాష్ట్రస్థాయి ఖోఖో పో టీలకు కొడంగల్‌లోని మహాత్మా జ్యోతిబాపూలే బీసీ గురుకుల పాఠశాల విద్యార్థి రోహిత్‌ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్‌ కె.నగేష్‌ సోమవారం తెలిపారు. జీడిమెట్లలో నిర్వహించిన అండర్‌ –14 విభాగం పోటీల్లో పాఠశాలకు చెందిన 8వ తరగతి విద్యార్థి రోహిత్‌ ప్రతిభ చాటి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. వ్యాయామ ఉపాధ్యాయుడు చంద్రశేఖర్‌, ఉపాధ్యాయులు రోహిత్‌ను అభినందించారు.

అక్రమ అరెస్టులు సరికాదు

నవాబుపేట: హక్కుల కోసం పోరాడుతుంటే పోలీసులు అక్రమంగా అరెస్టులు చేయడం సరికాదని అఖిల భారత దివ్యాంగుల హక్కుల పరిరక్షణ సమితి జిల్లా అధ్యక్షుడు సుధీర్‌ అన్నారు. సోమవారం కొడంగల్‌లో ధర్నా నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. తమను అక్కడికి వెళ్లకుండా పోలీసులు నవాబుపేటలో హౌస్‌ అరెస్ట్‌ చేశారన్నారు. తమ న్యాయమైన హక్కులు, ఉద్యోగాలు, పెండింగ్‌లో ఉన్న బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీ, పెన్షన్లు, సంక్షేమ పథకాల అమలు కోసం ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటానికి వెళ్తుంటే అరెస్టు చేయ డం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. తమను అడ్డుకున్నంత మాత్రాన పోరాటం ఆగిపోదన్నారు. ఎన్ని నిర్బంధాలు ఎదురైనా ఉద్య మం కొనసాగుతుందని స్పష్టం చేశారు. అరెస్టయిన వారిలో హన్మంత్‌, వెంకటేశ్‌ ఉన్నారు.

దళిత మోర్చా ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా శ్రీనివాస్‌

కుల్కచర్ల: దళిత మోర్చా రాష్ట్ర ఎగ్జిక్యూటివ్‌ మెంబర్‌గా కుల్కచర్ల గ్రామానికి చెందిన బీజేపీ నాయకుడు సంగెం శ్రీనివాస్‌ నియమితులయ్యా రు. సోమవారం నగరంలో రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతి కిరణ్‌ చేతులమీదుగా నియామక ప త్రం అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్టీ అభ్యున్నతికి కృషి చేస్తా నని తెలిపారు. తన నియామకానికి సహకరించిన పార్టీ జిల్లా కన్వీనర్‌ ప్రహ్లాదరావు, జిల్లా అధ్యక్షుడు రమేష్‌కు ధన్యవాదాలు తెలిపారు.

సత్వరం పరిష్కరించాలి

అనంతగిరి: ప్రజావాణి దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచరాదని, వెంటనే పరిష్కరించాలని కలెక్టర్‌ కార్యాలయం ఏఓ పర్హీన్‌ ఖాతూం తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణికి 26 అర్జీలు వచ్చాయి. కార్యక్రమంలో అడిషనల్‌ డీఆర్‌డీఓ సత్తయ్య పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement