నేను తలచుకుంటే సీఎం సభనుఅడ్డుకునే వాన్ని అంత్యక్రియలకు వెళ్తుంటే ఆపడం ఏంటి? కొడంగల్ మాజీ ఎమ్మెల్యేపట్నం నరేందర్‌రెడ్డి
పరిగి: రాష్ట్రంలో ఉన్నది ప్రజా ప్రభుత్వం కాదని.. దొంగల ప్రభుత్వమని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆరోపించారు. గుండుమల్ మాజీ సర్పంచ్, తెలంగాణ ఉద్యమకారుడు చెన్న ప్ప మృతి చెందడంతో సోమవారం బాధిత కుటుంబాన్ని పరామర్శించడానికి నగరం నుంచి వెళ్తున్న ఆయన్ను పరిగి వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో వాగ్వాదం చోటు చేసుకుంది. విషయం తెలుసుకున్న పరిగి మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి, బీఆర్‌ఎస్ నాయకులు భారీగా అక్కడికి చేరుకున్నారు.అనంతరం వారు విలేకరులతో మాట్లా డారు. పార్టీ కార్యకర్త, తెలంగాణ ఉద్యమకారుడు చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా అడ్డుకోవడం సిగ్గు చేటన్నారు. ప్రభుత్వం ప్రజలకు ఉపయోగపడే పనులు చేయడం లేదని విమర్శించారు. ప్రజా ప్రభుత్వం అని చెప్పుకునే సీఎం ఎందుకు ఇంత భయపడుతున్నారని ప్రశ్నించారు. తాను తలచుకుంటే కొడంగల్‌లో సీఎం సభ జరగకుండా చేసేవాడినని, ఆ అవసరం తనకు లేదన్నారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే కొప్పుల మహేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో చెప్పింది ఒకటి ఇప్పుడు చేస్తున్నది మరొకటని ఆరోపించారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులు ప్రవీణ్‌రెడ్డి, శివనోళ్ల భాస్కర్, ఆంజనేయులు, ముకుంద అశోక్‌కుమార్, రవికుమార్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.


