బంట్వారం: వీధి కుక్కల దాడిలో తొమ్మిది మేక పిల్లలు మృతి చెందాయి. ఈ ఘటన సోమవారం సాయంత్రం మండలకేంద్రంలో చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి.. బంట్వారానికి చెందిన బండమీది రాజు కుటుంబం మేకలు పెంచుతూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే తొమ్మిది పిల్లలను షెడ్డులో ఉంచి మేత కోసం మేకలను అడవిలోకి తోలుకెళ్లారు. కుక్కలు షెడ్డులోకి ప్రవేశించి మేక పిల్లలపై దాడి చేసి చంపాయి. సాయంత్రం తిరిగి వచ్చిన కాపరులు మేక పిల్లలు చనిపోయి ఉండటం చూసి బోరున విలపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరారు.


