సీఎం సభకు పూడూరు నాయకులు | - | Sakshi
Sakshi News home page

సీఎం సభకు పూడూరు నాయకులు

Nov 10 2026 8:21 AM | Updated on Nov 10 2026 8:21 AM

సీఎం సభకు పూడూరు నాయకులు అక్రమ అరెస్టులకు భయపడం పరిగి ఆర్టీసీ డిపోలో అగ్ని ప్రమాదం పోలీస్‌ వాహనం బోల్తా

పూడూరు: తెలంగాణ అభివృద్ధే ధ్యేయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కృషి చేస్తున్నారని డీసీసీ ఉపాధ్యక్షుడు కడ్మూరు ఆనందం అన్నారు. సోమవారం కొడంగల్‌ నియోజకవర్గం హకీంపేట్‌లో సీఎం రైతు సభకు మండలం నుంచి భారీగా తరలివెళ్లారు. కార్యక్రమంలో పీఏసీఎస్‌ చైర్మన్‌ పట్లోళ్ల రఘునాథ్‌రెడ్డి, ఆత్మకమిటీ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌ చైర్మన్‌ సురేందర్‌ ముదిరాజ్‌, డీసీసీ కార్యదర్శులు శ్రీనివాస్‌, అజీం పటేల్‌ తదితరులు పాల్గొన్నారు.

బంట్వారం: అక్రమ అరెస్టులకు భయపడేది లేదని బీవీహెచ్‌పీఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కావలి నర్సింలు అన్నారు. కొడంగల్‌లో సీఎం పర్యటన నేపథ్యంలో బంట్వారం పోలీసులు సోమవారం సల్బత్తాపూర్‌లో నర్సింలును ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో దివ్యాంగులకు ఇచ్చిన హమీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే అమలు చేయాలని కోరారు. లేకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని హెచ్చరించారు.

టపాసుల నిప్పురవ్వలు పడటంతో చెలరేగిన మంటలు

పరిగి: పట్టణంలోని ఆర్టీసీ డిపోలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. దీపావళి సందర్భంగా గంజి రోడ్డులో టపాసులు కాల్చుతుండగా నిప్పురవ్వలు ఆర్టీసీ డిపో ఆవరణలో పండటంతో అక్కడి చెట్ల నుంచి రాలిన ఆకులు అంటుకున్నాయి. డిపోలోకి మంటలు వ్యాపించడంతో స్థానికులు ఆర్‌టీసీ, ఫైర్‌ సిబ్బందికి తెలియజేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు.

● ఎస్‌ఐ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలు

● బొంరాస్‌పేట వద్ద ఘటన

పరిగి: సీఎం రేవంత్‌రెడ్డి బందోబస్తులో భాగంగా పెట్రోలింగ్‌ నిర్వహిస్తున్న పరిగి పోలీస్‌ వాహనం సోమవారం రాత్రి బొంరాస్‌పేట వద్ద బోల్తా పడింది. ఈ ఘటన హైదరాబాద్‌ –బీజాపూర్‌ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పరిగి పోలీస్‌ స్టేషన్‌లో విధులు నిర్వహిస్తున్న ఎస్‌ఐ – 3 సత్యనారాయణ, డ్రైవర్‌ వెంకటేశ్‌ సీఎం బందో బస్తులో పాల్గొన్నారు. తుంకిమెంట్ల నుంచి గడిసింగాపూర్‌ వరకు పెట్రోలింగ్‌ నిర్వహిస్తుండగా రాత్రి 10 గంటల సమయంలో డివైడర్‌ను ఢీకొని వాహనం బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఎస్‌ఐ, డ్రైవర్‌కు తీవ్ర గాయాలయ్యాయి. వారిని పరిగి ప్రభుత్వ ఆస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నగరానికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement