గల్లీకో బెల్ట్‌ దుకాణం! | - | Sakshi
Sakshi News home page

గల్లీకో బెల్ట్‌ దుకాణం!

Nov 10 2026 8:21 AM | Updated on Nov 10 2026 8:21 AM

తుర్కయంజాల్‌: ఇళ్లు, కిరాణ దుకాణాలు, పాన్‌ డబ్బాలు, టీస్టాల్స్‌ కావేవీ మద్యం దుకాణాలకు అడ్డా అన్నట్టు తయారైంది పరిస్థితి. రాత్రి, పగలు తేడా లేకుండా విచ్చలవిడిగా మద్యం విక్రయిస్తున్నారు. గల్లీకో బెల్ట్‌ దుకాణం వెలసినా ఎకై ్సజ్‌, పోలీసు అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలోని డివిజన్లతో పాటు అన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో బెల్ట్‌ దుకాణాలు నడుస్తున్నాయి. ఆదిభట్ల సర్కిల్‌ పరిధి తొర్రూర్‌ డివిజన్‌ కమ్మగూడ, లక్ష్మీనగర్‌ కాలనీలో బెల్ట్‌ దుకాణాలను తొలగించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ ఇటీవల స్థానికులు ఉన్నతాధికారులను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినా ఫలితం లేకపోవడంతో కాలనీవాసులు వాటి ఎదుట ధర్నాలు చేయడం చర్చకు దారితీసింది.

అనేక సమస్యలకు దారి

నివాసాల మధ్య బెల్ట్‌ దుకాణాల ఏర్పాటు అనేక కుటుంబాల్లో చిచ్చు రాజేస్తోంది. కుటుంబంలోని పెద్దలతో పాటు, యువకులు మద్యానికి బానిసలుగా మారిపోతున్నారు. పనులు, ఉద్యోగాలకు వెళ్లకపోవడంతో కుటుంబాల్లో గొడవలకు దారితీస్తోంది. యువకులు మద్యానికి అలవాటుపడుతుండటంతో చదువు, కెరీర్‌పై ప్రభావం పడుతోంది. రోజంతా కష్టపడి సంపాదించిన దాంట్లో అధిక శాతం మద్యానికి ఖర్చవుతుండటంతో కుటుంబాల ఆర్థిక పరిస్థితులు దిగజారిపోతున్నాయి. మహిళలు, బాలికలు ఇళ్లలో నుంచి బయటకు వెళ్లడానికి ఇబ్బంది పడాల్సి వస్తోంది.

శాంతిభద్రతల సమస్యలకు కారణం

ఆదిభట్ల పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని కమ్మగూడ లక్ష్మీనగర్‌ కాలనీ, ఇందిరమ్మ కాలనీ, సుందరయ్య కాలనీల్లోని పలు ఇళ్లలో ఇటీవల చోరీలు జరిగాయి. వీటికి ముఖ్య కారణం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఇళ్ల మధ్యలో ఉన్న బెల్ట్‌ దుకాణాల్లో మద్యం విక్రయించడమే కారణమని స్థానికులు భావించారు. మద్యం మత్తులో తరచూ గొడవలు, వివాదాలు జరుగుతుండటంతో ఎలాగైనా వీటి తొలగింపునకు పోరాడాలని నిశ్చయించుకున్నారు. బెల్ట్‌ దుకాణాల నిర్వాహకుల పేర్లతో కూడిన జాబితాను తయారు చేసి ఎకై ్సజ్‌, పోలీసు శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు.

చర్యలు శూన్యం

తెలంగాణ ఎకై ్సజ్‌ అండ్‌ ప్రొహిబిషన్‌ చట్టం ప్రకారం అనుమతులు లేకుండా మద్యం విక్రయించడం, నిల్వ ఉంచడం చట్టరీత్యా నేరం. అయినా ఇళ్ల మధ్య పెద్ద ఎత్తున నిల్వలు ఉంటున్నా పట్టించుకున్న దాఖలాలు లేవు. మొక్కుబడిగా అక్కడక్కడ కేసులు నమోదు చేసి చేతులు దులుపుకొంటున్నారనే విమర్శలు ఉన్నాయి. పాఠశాలలు, దేవాలయాలు, నివాస ప్రాంతాల మధ్య అక్రమ మద్యం విక్రయాలను అరికట్టడంతో పాటు, వీటికి మద్యాన్ని సరఫరా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.

విచ్చలవిడిగా మద్యం

రాత్రి, పగలు తేడా లేకుండా విక్రయం

తొలగించాలని స్థానికుల ఆందోళన

పట్టించుకోని అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement