చేవెళ్ల: స్థానిక తహసీల్దార్ కార్యాలయం పక్కనే ఓల్డ్ పట్వారీ క్వార్టర్స్ ఉన్నాయి. ఇవి పాతవి కావడంతో ఎవరూ ఉపయోగించడం లేదు. వీటిలోని ఓ క్వార్టర్ గదిలో రెవెన్యూ కార్యాలయంలో ఉన్న పాత మెటీరియల్స్ పేపర్స్ భద్రపర్చారు. ఓ కిటికీ తలుపులు పాడవడంతో తెరిచే ఉన్నాయి. ఆదివారం దీపావళి పండుగ కావడంతో పక్కనే ఉన్న కాలనీలో పిల్లలు కాల్చిన టపాసుల నిప్పురవ్వ కిటికీలో నుంచి గదిలో పడి ప్రమాదవశాత్తు పేపర్లకు మంటలు అంటుకున్నాయి. గదిలో నుంచి పొగలు వస్తుండడంతో స్థానికులు గమనించి పోలీసులు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. వారు వచ్చి మంటలు ఆర్పివేశారు. అప్పటికే గదిలో ఉన్న కాగితాలు మొత్తం కాలి బూడిదయ్యాయి. తహసీల్దార్ కార్యాలయానికి సంబంధించిన పత్రాలు కావడంతో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అంతా పాత భూ రికార్డులు కాలిపోయాయి అనుకుని భయపడ్డారు. కాగా, అగ్ని ప్రమాదం జరిగిన క్వార్టర్స్‌లో ఉన్నవి కేవలం ఓల్డ్ మెటిరీయల్స్ పేపర్స్ మాత్రమేనని, భూ రికార్డులకు సంబంధించిన విలువైన పత్రాలు అందులో లేవని తహసీల్దార్ కృష్ణయ్య స్పష్టం చేశారు.
ఆర్గానో విల్లాస్‌లో అగ్నిప్రమాదం
మొయినాబాద్: బాణసంచా పేలుస్తుండగా నిప్పురవ్వలు గడ్డిపై పడడంతో ఆర్గానో విల్లా స్‌లోని క్లబ్‌హౌస్ పూర్తిగా దగ్ధమైంది. ఈ సంఘటన మున్సిపల్ పరిధిలోపి ఎనికేపల్లి రెవెన్యూ లో ఉన్న ఆర్గానో విల్లాస్‌లో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. దీపావళి సందర్భంగా ఆర్గానో విల్లాస్‌లో ఉండే కుటుంబాలు క్లబ్‌హౌస్ ప్రాంతంలో వేడుకలు నిర్వహిస్తున్నాయి. అందులో భాగంగా బాణసంచా పేల్చడంతో నిప్పురవ్వలు ఎగిరి క్లబ్‌హౌస్ పరిసరాల్లోని గడ్డిపాకపై పడ్డాయి. దీంతో మంటలు అంటుకుని క్లబ్‌హౌస్‌కు వ్యాపించాయి. అందుబాటులో ఫైర్‌స్టేషన్ లేకపోవడంతో స్విమ్మింగ్ పూల్‌లోని నీటితో బకెట్లు, మోటా ర్ల ద్వారా చల్లుతూ మంటలు ఆర్పే ప్రయత్నం చేశారు. ఎంతకీ ఆరకుండా క్లబ్‌హౌస్ పూర్తిగా దగ్ధమైంది. ఈ ఘటనకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు.
బాణసంచా నిప్పు రవ్వతో..


