రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన బైక్‌ | - | Sakshi
Sakshi News home page

రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన బైక్‌

Nov 10 2026 8:21 AM | Updated on Nov 10 2026 8:21 AM

రాంగ్‌ రూట్‌లో దూసుకొచ్చిన బైక్‌

● అదుపుతప్పిన విద్యార్థిని బైక్‌

● బస్సు కిందపడ్డ అక్కడికక్కడే మృతి

● నల్లకుంట పరిధిలో ఘటన

నల్లకుంట: కుమార్తెను ద్విచక్రవాహనంపై కళాశాలకు తీసుకెళ్తుండగా.. రాంగ్‌ రూట్‌లో మరో బైక్‌ దూసుకొచ్చింది. దీంతో అదుపు తప్పి ఇద్దరు కిందపడగా.. కుమార్తె తలపై నుంచి ఆర్టీసీ బస్సు వెళ్లడంతో అక్కడికక్కడే మృతి చెందింది. ఈ ఘటన నల్లకుంట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. ఎస్సై హరిష్‌ తెలిపిన వివరాలు.. పాతబస్తీ హఫీజ్‌నగర్‌ నివాసి మహ్మద్‌ ఆరీఫ్‌ కుమార్తె షేక్‌ ఐషా ముస్ఫిరా(21) ఓయూ ఇంజనీరింగ్‌ కళాశాలలో బీఈ మైనింగ్‌ మూడో సంవత్సరం చదువుతోంది. సోమవారం ఉదయం తండ్రితో కలిసి ద్విచక్ర వాహనంపై కళాశాలకు వెళ్తూ ఫీవర్‌ ఆసుపత్రి సిగ్నల్స్‌ వద్ద ఉన్న షైలా కేఫ్‌ వద్దకు చేరుకున్నారు. ఎదురుగా రాంగ్‌ రూట్‌లో మరో వ్యక్తి వేగంగా ద్విచక్ర వాహనంపై వచ్చాడు. దీంతో ఆరీఫ్‌ తన వాహనానికి ఒక్క సారిగా బ్రేక్‌ వేయడంతో అదుపు తప్పి ఎడమ వైపు పడిపోగా కుమార్తె ఐషా కుడి పైపు రోడ్డుపై పడిపోయింది. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు వెనక చక్రాల కింద ఐషా పడిపోవంతో తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని గాంధీ మార్చురికీ తరలించారు.

ఆగిఉన్న లారీని ఢీ కొట్టిన ఆటో

హయత్‌నగర్‌: ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొనడంతో ఓ మహిళ మృతి చెందగామరో ఇద్దరు గాయపడ్డారు. హయత్‌నగర్‌ పోలీసులు తెలిపిన మేరకు.. పసుమాముల కళానగర్‌కు చెందిన యడవల్లి పద్మ(26), రేవల్లి దుర్గమ్మలు సోమవారం ఉదయం ఆటోలో స్క్రాప్‌ సామాను తీసుకుని పెద్దఅంబర్‌పేట్‌ వైపు వెళ్తున్నారు. సంఘం హోటల్‌ వద్ద రోడ్డుపై లారీ ఎలాంటి హెచ్చరికలు లేకుండా డ్రైవర్‌ నిలిపివేశాడు. ఆటో డ్రైవర్‌ గమనించకుండా వెళ్లడంతో ఆటో లారీని ఢీకొట్టింది. దీంతో ఆటోలో ప్రయాణిస్తున్న పద్మ అక్కడికక్కడే మృతి చెందగా, మరో ప్రయాణికురాలు దుర్గమ్మ, ఆటో డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు.

దీపావళి రోజున ఆరిపోయిన జీవితం

రహమత్‌నగర్‌ : దీపావళి రోజున గుడికి వెళ్తున్న ఒక వృద్ధుడిని ద్విచక్ర వాహనం మృత్యువు రూపంలో కబలించింది. బోరబండ సెక్టార్‌ ఎస్సై శ్రీకాంత్‌ తెలిపిన మేరకు.. కళ్యాణ్‌నగర్‌ వెంచర్‌–1కు చెందిన బలేశ్వర్‌(77) దీపావళి సందర్భంగా పూజ చేసేందుకు శనివారం ఉదయం జీటీఎస్‌ ఆలయానికి బయలుదేరాడు. కళ్యాణ్‌నగర్‌ సిగ్నల్‌ సమీపంలోకి రాగానే ఎస్‌ఆర్‌ నగర్‌ వైపు వేగంగా వెళ్తున్న రాపిడో ద్విచక్ర వాహనం బలంగా ఢీకొట్టింది. దీంతో బలేశ్వర్‌ తీవ్ర గాయాలతో రోడ్డుపై పడిపోయాడు. స్థానికులు బంధువులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న బంధువులు సెయింట్‌ థెరిస్సా ఆసుపత్రికి తరలించగా పరిశీలించిన వైద్యులు అప్పటికే అతను మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి, ప్రమాదానికి కారణమైన రాపిడో ద్విచక్ర వాహన డ్రైవర్‌ రవితేజను అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement