గీత కార్మికుల సమస్యలపై పోరాటం | - | Sakshi
Sakshi News home page

గీత కార్మికుల సమస్యలపై పోరాటం

Nov 10 2026 8:21 AM | Updated on Nov 10 2026 8:21 AM

చేవెళ్ల: గీత కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఆదుకోవాలని సీపీఐ గీతా పనివారల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధాకర్‌గౌడ్‌ అన్నారు. మండలంలోని ముడిమ్యాలలో గీతా పనివారల సంఘం సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన గీత కార్మికులకు సభ్యత్వ నమోదు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. గ్రామాల్లో ఉన్న గీత పనివారల సొసైటీలకు 5 నుంచి 10 ఎకరాల భూమి కేటాయించాలన్నారు. గీత వృత్తిదారులలో అర్హులైన వారికి వెంటనే పెన్షన్‌లు అందజేయాలన్నారు. గీత వృత్తిదారులకు జీవనోపాధి కల్పించేందుకు తాటి, ఈత, ఖర్జూర వనాల పెంపకానికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు, రాయతీలు అందించాలన్నారు. గ్రామస్థాయి నుంచి మండల, జిల్లా, రాష్ట్రస్థాయి వరకు కమిటీలను వేసుకొని ఈ సంఘాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని సూచించారు. గీత వృత్తిదారుల కోసం సంఘం నిరంతరం పనిచేస్తోందని చెప్పారు. కార్యక్రమంలో ఈశ్వరయ్యగౌడ్‌, చెన్నయ్యగౌడ్‌, బాల్‌చెట్టిగౌడ్‌, రమేశ్‌, శ్రీనివాస్‌, సతీశ్‌, మహేందర్‌గౌడ్‌ తదితరులు ఉన్నారు.

గీతా పనివారల సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సుధాకర్‌గౌడ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement