సాక్షి, రంగారెడ్డిజిల్లా: రైతులు పండించిన ధాన్యాన్ని ప్రభుత్వం ఐకేపీ కేంద్రాల ద్వారా సేకరిస్తుంది. తర్వాత ఎంపిక చేసిన రైస్ మిల్లుకు ఆ ధాన్యాన్ని పంపుతుంది. మిల్లర్లు మరాడించి క్వింటాల్‌కు 67 కేజీల బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించాల్సి ఉంది. రైస్ మిల్లులకు సీఎంఆర్ కేటాయింపులో సరుకు పక్కదారి పట్టకుండా చూసేందుకు జిల్లా పౌరసరఫరాల అధికారి (డీఎస్‌ఓ), జిల్లా మేనేజర్ (డీఎం)డిప్యూటీ తహసీల్దార్‌తో పాటు మిల్లర్‌ను జాయింట్ కస్టోడియన్లుగా నియమిస్తారు. వీరు అక్రమాలకు పాల్పడితే తనిఖీల ద్వారా కనిపెట్టే బాధ్యత ఈటీఎఫ్‌దే. పదవీ విరమణ పొందిన కొంత మంది అధికారులు ఈటీఎఫ్‌లో ఏళ్లుగా ఓఎస్డీలుగా పాతుకుపోయి అక్రమాలకు అండగా నిలుస్తుండడంతో క్షేత్రస్థాయి అధికారులు ఏమీ చేయలేక పోతున్నట్లు తెలిసింది. సీఎంఆర్ ఎగవేతకు పాల్పడిన మిల్లులకు ప్రభుత్వం ఇచ్చిన బకాయిల చెల్లింపు గడువు కూడా ఇటీవలే ముగిసింది. బకాయిదారులపై రెవెన్యూ రికవరీ యాక్ట్(ఆర్‌ఆర్ యాక్ట్)ను ప్రయోగించేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. బకాయిదారుల్లో ఇప్పటికే పలు మిల్లులు మాయం కావడం, ఉన్నవి చేతులు మారడంతో ఏం చేయాలో తెలియక ప్రస్తుత జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారులు తలపట్టుకోవాల్సి వస్తోంది.
మొండికేసిన మిల్లులు ఇవే..
● చింతపల్లిగూడెంలోని పవన్ ఇండస్ట్రీస్ 2022–23 సహా 2023–24 రబీ మార్కెటింగ్ సీజన్లకు సంబంధించి జరిమానాతో కలిపి 5,430.172 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు సంబంధించిన రూ.15,63,60,464 బకాయి చెల్లించాల్సి ఉంది. జిల్లాలో అత్యధిక బకాయి చెల్లించాల్సిన మిల్లుల జాబితాలో తొలిస్థానంలో నిలిచింది.
● పోలేపల్లిలోని శ్రీసాయిరామ్ రైస్‌మిల్ 2022–23 రబీ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి జరిమానాతో కలిపి 2,507.246 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు సంబంధించిన రూ.7,54,50,426 బకాయి చెల్లించాల్సి ఉంది.
● మక్తమాదారంలోని శ్రీరాఘవేంద్ర బిన్ని రైస్‌మిల్ యాజమాన్యం 2022–23 రబీ, ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్లకు సంబంధించి అసలుపై 125 శాతం పెనాల్టీతో కలిపి 1,598.596 మెట్రిక్ టన్నుల ఽసీఎంఆర్‌కు సంబంధించి రూ.4,88,72,260 బకాయి చెల్లించాల్సి ఉంది.
● కొల్కలపల్లిలోని శ్రీమహాలక్ష్మీ రైస్‌మిల్లు యాజమాన్యం 2023–24 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి జరిమానాతో కలిపి 234.492 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు సంబంధించిన రూ.70,21,199 బకాయి చెల్లించాల్సి ఉంది.
● శంకర్‌పల్లిలోని శ్రీరాఘవేంద్ర రైస్‌మిల్లు యాజమాన్యం 2023–24 ఖరీఫ్ మార్కెటింగ్ సీజన్‌కు సంబంధించి జరిమానాతో కలిపి 263.721 మెట్రిక్ టన్నుల సీఎంఆర్‌కు సంబంధించిన రూ.76,82,635 బకాయి చెల్లించాల్సి ఉంది.
● ఎలికట్టలోని మణికంఠ ఇండస్ట్రీస్, ఆమనగల్లులోని శ్రీలక్ష్మీ వెంకటసాయి పీబీఆర్‌ఐ, శ్రీరామాంజనేయ రైస్‌మిల్, కనకదుర్గ బీఆర్‌ఎం, చింతపల్లిలోని శ్రీరాఘవేంద్రరైస్ ఇండస్ట్రీలు 2022–23 రబీ మార్కెటింగ్ సీజన్‌లో సీఎంఆర్‌లో భాగంగా అసలు చెల్లించి, కేవలం 125 శాతం జరిమానా కింద బకాయి పడిన 1,654.173 మెట్రిక్ టన్నులకు రూ.5,95,11,200 చెల్లించాల్సి ఉంది.
రైస్ మిల్లర్ల మాయాజాలం
రూ.కోట్లలో సీఎంఆర్ బకాయి
కనిపించకుండా పోయిన కొన్ని మిల్లులు
జరిమానాతో కలిపి పేరుకుపోయిన మొత్తం
ఆర్‌ఆర్ యాక్ట్‌కు వెరవని ఎగవేతదారులు
‘కడ్తాల్‌లోని వరలక్ష్మీ పీబీఆర్‌ఎం రైస్‌మిల్లు యాజమాన్యం 2015–16 రబీ సీజన్‌కు సంబంధించి 495.508 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్డ్ రైస్ (సీఎంఆర్) బకాయి పడింది. సకాలంలో సీఎంఆ ర్ చెల్లించని కారణంగా అసలుపై 125 శాతం ఫెనాల్టీ కలిపి మొత్తం 619.385 మెట్రిక్ టన్నులకు రూ.2,28,70,840 బకాయి చెల్లించాల్సి ఉందని అప్పటి అధికారులు నిర్ధారించారు. ఆ మేరకు నోటీసులు సిద్ధం చేశారు. తీరా క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తే మిల్లు కన్పించకుండా పోయింది. ఆరా తీసి, బకాయి మొత్తాన్ని వసూలు చేయాల్సిన ఎన్‌ఫోర్స్‌మెంట్ టాస్క్‌ఫోర్స్ (ఈటీఎఫ్) అక్రమార్కులకు అండగా నిలిచినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా ప్రభుత్వ ఖజానాకు భారీ నష్టం వాటిల్లింది.
ఆస్తులకు వేలం
కడ్తాల్‌లోని వరలక్ష్మీ మిల్లు జిల్లాల ఫునర్విభజనలో భాగంగా జిల్లా పరిధిలోకి వచ్చింది. అప్పటికే ఆ మిల్లు మూతపడింది. విజిలెన్స్ విచారణ, కేసు కూడా నమోదైంది. ఆ కేసుకు సంబంధించిన ఫైల్స్ ఏవీ మాకు ఇప్పటి వరకు అందలేదు. పొజిషన్‌లో చూస్తే మిల్లు కన్పించలేదు. సీఎంఆర్ బకాయిల వసూళ్ల కోసం మిల్లర్లపై ఒత్తిడి తెస్తున్నాం. ఇప్పటికే మిల్లర్లకు ఇచ్చిన గడువు ముగిసింది. అయినా స్పందించని వారి ఆస్తులను ఆర్‌ఆర్ యాక్ట్ ప్రకారం వేలం వేయాలని నిర్ణయించాం.
– ఎస్.స్వప్న, ఇన్‌చార్జి మేనేజర్, జిల్లా పౌరసరఫరాలశాఖ


